Denduluru : సై..అంటే సై అంటున్న చింతమనేని ప్రభాకర్ vs కొఠారు అబ్బయ్య చౌదరి..!
ప్రధానాంశాలు:
దెందులూరు నియోజకవర్గంలో టెన్షన్ ...టెన్షన్
Denduluru : సై..అంటే సై అంటున్న చింతమనేని ప్రభాకర్ vs కొఠారు అబ్బయ్య చౌదరి..!
Denduluru : పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరియు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అబ్బయ్య చౌదరి స్వగ్రామమైన కొండలరావు పాలెంలో ‘చలో కొండలరావుపాలెం’ పేరుతో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ వర్గాన్ని అలర్ట్ చేసింది.

Denduluru : సై..అంటే సై అంటున్న చింతమనేని ప్రభాకర్ vs కొఠారు అబ్బయ్య చౌదరి..!
Denduluru : దెందులూరు నియోజకవర్గంలో కొట్లాటకు సిద్దమైన టీడీపీ – వైసీపీ వర్గీయులు
అధికార పార్టీ నేతల నిరసన కు పోటీగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. దాంతో గ్రామంలో ఉద్రిక్తత చెలరేగే అవకాశం ఉందన్న భయంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం చుట్టూ పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, నిరసనకారులు గ్రామంలోకి ప్రవేశించకుండా ప్రధాన రహదారుల వద్ద బారికేడ్లు వేయడం జరిగింది. రెండు వర్గాలు ఒకే సమయంలో రోడ్డెక్కితే పరిస్థితులు అదుపు తప్పే అవకాశముండటంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.
ప్రస్తుతం కొండలరావు పాలెం పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలు గందరగోళానికి లోనవుతుండటంతో పోలీసులు గ్రామ ప్రజలకు శాంతిని మెసేజ్ చేస్తున్నారు. స్థానిక పెద్దలు, రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడంతో సమస్య మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.