Thalliki Vandanam : తల్లికి వందనం” పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చిన చంద్రబాబు
ప్రధానాంశాలు:
Thalliki Vandanam : తల్లికి వందనం" పథకానికి సంబదించిన కీలక అప్డేట్ ఇచ్చిన చంద్రబాబు
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందించేందుకు “తల్లికి వందనం” అనే కొత్త పథకాన్ని అమలు చేయబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000 సహాయం అందజేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, అందరికీ ఈ సొమ్ము లభించేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే, తల్లుల ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు.

Thalliki Vandanam : తల్లికి వందనం” పథకానికి సంబదించిన కీలక అప్డేట్ ఇచ్చిన చంద్రబాబు
Thalliki Vandanam “తల్లికి వందనం” కీలక అప్డేట్
ఈ పథకం అమలు వల్ల తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గడం, విద్యార్థుల చదువుకు మరింత ప్రోత్సాహం లభించడం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇది గొప్ప ఊరట కలిగించే పథకంగా నిలవనుంది. విద్యార్థుల చదువును ప్రోత్సహించడంతో పాటు, మైనారిటీలు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోంది.
అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని AI టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది AI ప్రొఫెషనల్స్‌ను తయారు చేయడం లక్ష్యంగా మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పాలన మొత్తం వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో నడుస్తోందని, ప్రతి విద్యార్థి అగ్రగామిగా ఎదగాలని చంద్రబాబు అన్నారు.