Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

  •  కార్యకర్త కాన్వాయ్ కింద పడిపోయిన పట్టించుకోని జగన్ - వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘జగన్ లో మనిషి లక్షణాలే లేవు’’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘‘నీ కారు టైర్ కింద నీ పార్టీ కార్యకర్తే పడిపోతే కూడా, కారును ఆపకుండా ముందుకు వెళ్లిపోయావ్ ఇదేనా నీ మానవత్వం’’ అని ప్రశ్నించారు. ఇటువంటి అమానవీయ చర్యలు ప్రజల మన్నన పొందే నాయకునికి తగవని ఆమె అన్నారు.జగన్‌‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించి సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..?  కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? ఉంటె ఆలా వెళ్లిపోవు – అనిత

సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తూ జగన్ ప్రయాణించిన వాహనమేనని వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం లభించింది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో జగన్ కారు పైనుంచి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదే సమయంలో ఓ కార్యకర్త (సింగయ్య) కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో, కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా, వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన పై వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ‘‘కారు పక్కకు ఆపి సింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తే బతికి ఉండేవాడు’’ అని వ్యాఖ్యానించారు. ఇది ఎంతటి బాధాకరమైన ఉదంతమో చెప్పలేనిదని ఆమె అన్నారు. ఓ నేతగా తన కార్యకర్తలకు బాధ్యత తీసుకోవాల్సిన సమయాల్లో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు. ‘‘ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోయినా బాధపడని నేత, ఆ కుటుంబానికి ఓదార్పు చెప్పలేని నాయకుడు ఇక ఏంచేస్తాడు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి వ్యవహారాలను గమనిస్తున్నారని, ఇక ముందు నాయకత్వంలో మానవత్వం, బాధ్యత ముఖ్యమని ప్రజలు నిర్ణయించుకుంటారని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. జగన్ లాంటి నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని ఆమె హెచ్చరించారు.

Advertisement

ramu

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి