
#image_title
Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల గురించి కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. యూట్యూబ్ ఓపెన్ చేసి వేణు స్వామి అని కొడితే పుంఖానుపుంఖలుగా వీడియోలు కనిపిస్తాయి. వేణు స్వామికి తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ ఉంది. ఆయన ఎవరి గురించి జ్యోతిష్యం చెప్పినా అది నూటికి నూరు పాళ్లు నిజం అవుతుందని ఇప్పటికే చాలాసార్లు రుజువు అయింది. రష్మిక మందన్నాకు రాజశ్యామల యాగం చేయడం వల్లే తను ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది. స్టార్ హీరోయిన్ అయింది అని జనాలు నమ్ముతారు. అలాగే.. చాలామంది హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులకు వేణు స్వామి రాజశ్యామల యాగం చేయించినట్టు తెలుస్తోంది.
జగన్ సీఎం కాకముందు.. 2018 లో నాలుగు సార్లు జగన్ సీఎం కావాలని వేణు స్వామి రాజశ్యామల యాగం చేశారట. వైజాగ్ దగ్గర భీమిలీలో ఈ యాగం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో చంద్రబాబుకు కూడా రాజశ్యామల యాగం చేయించుకోవాలని వేణు స్వామి చాలా సార్లు చెప్పారట. చంద్రబాబు వినరని.. బాలకృష్ణకు వేణు స్వామి చెప్పారట. బాలకృష్ణ చెప్పినా కూడా చంద్రబాబు అస్సలు వినలేదట. 2019 లో ఎలాగైనా రాజశ్యామల యాగం చేయించాలని బాలకృష్ణ పట్టుపట్టారట. చంద్రబాబును అడిగారట. కానీ.. చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నారట. ఆ యాగంలో తాను కూర్చోనని చంద్రబాబు అన్నారట. బాలకృష్ణ.. వేణు స్వామిని యాగం చేయడానికి ఒప్పించారు కానీ.. చంద్రబాబును ఒప్పించలేకపోయారట.
#image_title
చంద్రబాబు ఒప్పుకోకపోయినా పర్వాలేదు.. మీరు ఎమ్మెల్యే అవుతారు.. ఒప్పుకోండి. మీ పార్టీ మాత్రం రూలింగ్ లో ఉండదు అని బాలకృష్ణకు చెప్పా అని వేణు స్వామి చెప్పాడు. దీంతో బాలకృష్ణ ఒప్పుకున్నారని.. అప్పుడు బాలకృష్ణ కోసం చీరాలలో రాజశ్యామల యాగం చేశానని.. అందుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు ఎందుకు ఒప్పుకోలేదు అని యాంకర్ అడిగితే.. ఆయన అంతే.. ఆయన ఎవ్వరినీ నమ్మరు. ఆయనదంతా ఒక లోకం. ఆయన వెరైటీ. ఆయన మెంటాలిటీ వేరు. ఆయన మనం చెప్పకముందే మన గురించి చెప్పేస్తారు. ఆయనంటేనే భయం అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.