Pedakapu 1 Review : పెద కాపు అనేది సినిమా పేరే కానీ.. దాని అర్థం ఏంటో తెలుసా? పెద కాపు అంటే ఒక కమ్యూనిటీ పేరు. నిజానికి పెద కాపు అనేది గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే సామాజిక వర్గం. గోదావరి జిల్లాలకు చెందిన పెదకాపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి వెళ్తే ఎక్కడ చూసినా పెదకాపు పేరుతో ఉన్న షాపులే దర్శనమిస్తాయి. ఇప్పుడు అదే పేరుతో సినిమా కూడా వచ్చేసింది. ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీకాంత్ అడ్డాల గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తే కావడం.. కాపు బిడ్డ కూడా కావడంతో ఆయనకు కూడా ఈ సినిమా బీభత్సంగా కనెక్ట్ అయిందని చెప్పుకోవాలి. కానీ.. అసలు ఇది పెదకాపు అనే కులానికి సంబంధించిన సినిమా కాదు. పేరు అలా ఉన్నా కూడా ఒక వ్యక్తిని కాపలా కాసే సాధారణ వ్యక్తి కథ ఇది.
శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక కొత్త బంగారు లోకం సినిమా, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఒక ముకుంద.. ఇలా చాలా సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. బ్రహ్మోత్సవం లాంటి ప్లాఫ్ సినిమా ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇటీవల నారప్పతో మళ్లీ లైన్ లోకి వచ్చాడు శ్రీకాంత్. తాజాగా పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈసారి శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. పాత హీరోలను పక్కన పెట్టి విరాట్ కర్ణ అనే కొత్త యువకుడిని తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాగే.. ఈ సినిమాలో విలన్ గానూ నటించాడు శ్రీకాంత్ అడ్డాల. మరి ఈ యాక్షన్, డ్రామా ఎలా ఉందో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
నిజానికి ఈ సినిమా కథ ఇప్పటిది కాదు. 1980 తరం నాటిది. అప్పట్లో ఒక సామాన్యుడి కథ. పలు సవాళ్లకు ఒక సాధారణ వ్యక్తి ఎదుర్కొని ఎలా పోరాడాడు.. ఎలా బలవంతుడిగా మారాడు.. ఎలా ఎదిగాడు అన్నదే పెదకాపు 1 కథ. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఆయన్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు అలాంటి వాళ్లకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో నిజంగా కొందరు వ్యక్తులకు ఎదురైన సవాళ్లకు కొంత కథ జోడించారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే ఇది నిజమైన కథ అనే చెప్పుకోవాలి. ఈ కథ పెద్దది కావడంతో రెండు పార్టులుగా రానుంది.
నటీనటులు : విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేశ్, నాగబాబు, అనసూయ, ఈశ్వరి రావు
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్ : ద్వారక క్రియేషన్స్
నిడివి : 2 గంటల 29 నిమిషాలు
విడుదల తేదీ : 29 సెప్టెంబర్ 2023
శ్రీకాంత్ అడ్డాల మూవీ అంటేనే ఆ కథ కొంచెం కొత్తగా, మనకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కొత్త బంగారులోకం సినిమాను కొత్త హీరోతో తీశారు. ముకుందను కూడా కొత్త హీరోతో తీశారు. అలాగే.. ఇప్పుడు పెదకాపు 1 సినిమా కూడా కొత్త హీరో కావడంతో తనకు కావాల్సినంత ఫ్రీడమ్ దొరికేసింది. అందుకే సినిమాను తనకు నచ్చినట్టుగా తీశారు. హీరోగా నటించిన విరాట్ కర్ణ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అలాగే.. విలన్ గా శ్రీకాంత్ అడ్డాల ఇరగదీశారు. ఇక.. కీలక పాత్రల్లో నటించిన రావు రమేశ్, నాగబాబు, అనసూయ వీళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్
డైలాగ్స్
విజువల్స్
క్యారెక్టర్స్
టెక్నికల్ వాల్యూస్
బీజీఎమ్
మైనస్ పాయింట్స్
నో ఎమోషన్స్
స్టోరీ
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.50/5
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.