Vidadala Rajani : చంద్రబాబు పై నోరుజారిన మాజీ మంత్రి విడదల రజిని.. వీడియో!
ప్రధానాంశాలు:
చంద్రబాబు ను పట్టుకొని అనరాని మాట అనేసిన విడదల రజిని
చంద్రబాబు పై నోరుజారిన మాజీ మంత్రి విడదల రజిని
Vidadala Rajani : వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రజినీ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుగా “గాడు” అంటూ సంబోదించి, తర్వాత వెంటనే సరిదిద్దుకుని “గారు” అని అనడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది నుండి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చీకటి పాలన కొనసాగిస్తోందని, అభివృద్ధికి అడ్రస్ కనిపించలేదని పేర్కొన్నారు.

Vidadala Rajani : చంద్రబాబు పై నోరుజారిన మాజీ మంత్రి విడదల రజిని.. వీడియో!
Vidadala Rajani : చంద్రబాబు ను ‘గాడు’ అంటూ విడదల రజిని కామెంట్స్
రజినీ మాట్లాడుతూ “జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోయారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయం, పారదర్శకత కంటే అన్యాయం, అక్రమం, వివక్ష, రాజ్యాంగ ఉల్లంఘనలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు మరిచి, విరుద్ధంగా పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.
రజినీ చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యమంత్రిపై “గాడు” అనే మాట వాడడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీ పరువు మంటగలిపేలా మాట్లాడడం బాధాకరమని, రాజకీయ చరిత్రను మరిచిన వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజినీ గతంలో టిడిపిలో ఉన్నప్పటికీ ఇప్పుడు వైసీపీ అభిప్రాయాలను పెంచుకోవడమే ఆమె వ్యాఖ్యల ఉద్దేశమని వారు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబుపై నోరు జారిన మాజీ మంత్రి విడుదల రజిని
వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రిని గాడు అని సంబోధించి మళ్లీ గారు అని అన్న మాజీ మంత్రి pic.twitter.com/YzcXi2CKca
— BIG TV Breaking News (@bigtvtelugu) June 17, 2025