Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  వైసీపీలో మళ్లీ విజయసాయి యాక్టీవ్ కాబోతున్నాడా..?

  •  Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుంది. ముఖ్యంగా జగన్ లండన్‌లో ఉన్న సమయంలో సాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జగన్ చుట్టూ ఉన్న కొటరీ కారణంగానే పార్టీని వీడుతున్నానని ఆయన అప్పట్లో స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, లిక్కర్ స్కాం, కాకినాడ పోర్ట్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరిని బలంగా చాటాయి. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Vijayasai Reddy మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి జగన్ పిలుపు..?

విజయసాయి రాజకీయ ప్రయాణం వైఎస్ కుటుంబంతో చాలానే ముడిపడి ఉంది. వైఎస్ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఓబీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆయన, రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పక్కనే నిలబడ్డారు. జగన్‌తో జైలు జీవితం గడిపిన ఆయన, వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో విలువైన అనుభవం కలిగిన వ్యక్తిగా సాయిరెడ్డి పేరు దేశ రాజధానిలో సైతం గుర్తింపు పొందింది. కానీ 2024 ఎన్నికల్లో నెల్లూరులో ఓటమి అనంతరం, పార్టీలోని కొన్ని నిర్ణయాలు ఆయనకు నచ్చకపోవడంతో పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు.

ఇప్పుడు సాయిరెడ్డి మళ్లీ పార్టీలోకి రావాలన్న ఆలోచనపై జగన్ సానుకూలంగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ నేత ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. “సాయి రెడ్డితో పార్టీకి మేలు జరుగుతుంది” అనే అభిప్రాయాన్ని జగన్ కూడా పంచుకున్నారని అంటున్నారు. దీంతో విజయసాయిరెడ్డితో సంప్రదింపులు మొదలయ్యాయని, ఆయన కూడా జగన్‌పై తనకు వ్యతిరేకత ఏమీ లేదని తెలిపినట్టు సమాచారం. అన్ని అనుకూలిస్తే సాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరి నిజంగా విజయసాయి వైసీపీ లో చేరతారా..? లేదా అనేది కొద్దీ రోజులు ఆగితే కానీ తెలియదు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది