
YS Jagan : ఎట్టకేలకి జగన్ వెళ్లే మార్గంలో కరెంట్ నిలిపివేయడానికి కారణం చెప్పిన సీపీ..!
YS Jagan : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో రాయి దాడి జరిగిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ఘటన తర్వాత జగన్ బస్సుయాత్రగా వెళ్లేమార్గంలో పోలీసులు ఆంక్షలను చాలా స్ట్రిక్ట్ చేశారు. క్రేన్లతో భారీ గజమాలలు వేయడంతో పాటు అభిమానులు, ప్రజలు జగన్‌పై పువ్వులు విసరడాన్ని కూడా అనుమతించడం లేదు. అయితే జగన్ మాత్రం అందరని కలుసుకుంటూ ప్రేమగా ముందుకు సాగుతున్నారు. అయితే తన బస్సుయాత్రకు వస్తున్న ఆదరణను చూసి.. దాడులు చేయాలని చూస్తున్నారని జగన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని.. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని జగన్ తెలియజేశారు.
అయితే రాయి దాడి జరిగిన ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడ పర్యటనలో జగన్‌కి తగినంత భద్రత కల్పించామని వెల్లడించారు. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్ల బలగాలను సీఎం భద్రతకు కేటాయించామని, వాటికితోడు ఆక్టోపస్, సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఉంటుందని తెలియజేశారు. అయితే ముఖ్యమంత్రి యాత్రలో విద్యుత్ నిలిపివేయడంపై సీపీ స్పందిస్తూ.. అది సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమని తెలియజేశారు. జగన్ వెళ్లే మార్గలంలో కరెంట్ ఎందుకు తీసేసారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ రూట్‌లో కరెంట్ లైన్లు, కేబుల్ లైన్లు ఎక్కువగా ఉన్నాయి.
YS Jagan : ఎట్టకేలకి జగన్ వెళ్లే మార్గంలో కరెంట్ నిలిపివేయడానికి కారణం చెప్పిన సీపీ..!
అయితే విద్యుత్ తీగలు తొలగించడం కుదరదు కాబట్టి.. రూఫ్‌టాప్ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ నిలిపివేయడం సర్వసాధారణంగా జరిగేదే అని ఆయన చెప్పారు. అయితే సీఎం పర్యటనకు ఒక రోజు ముందే కేబుల్ లైన్లు తీసేశామని.. రూఫ్‌టాప్‌కి విద్యుత్ వైర్లు తగిలే అవకాశం ఉండడంతో భద్రత కోసమే విద్యుత్ నిలిపివేశామన్నారు. అయితే చీకట్లో, గుంపు బాగా ఉండటం చూసుకొని దుండగుడు జగన్‌పై రాయి విసిరాడని అన్నారు సీపీ. అయితే రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌పై పడిందని.. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.