YS Jagan : ఎట్ట‌కేల‌కి జ‌గ‌న్ వెళ్లే మార్గంలో క‌రెంట్ నిలిపివేయ‌డానికి కార‌ణం చెప్పిన సీపీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఎట్ట‌కేల‌కి జ‌గ‌న్ వెళ్లే మార్గంలో క‌రెంట్ నిలిపివేయ‌డానికి కార‌ణం చెప్పిన సీపీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : ఎట్ట‌కేల‌కి జ‌గ‌న్ వెళ్లే మార్గంలో క‌రెంట్ నిలిపివేయ‌డానికి కార‌ణం చెప్పిన సీపీ..!

YS Jagan : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో రాయి దాడి జరిగిన ఘటన ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ ఘ‌ట‌న త‌ర్వాత జగన్‌ బస్సుయాత్రగా వెళ్లేమార్గంలో పోలీసులు ఆంక్షలను చాలా స్ట్రిక్ట్ చేశారు. క్రేన్లతో భారీ గజమాలలు వేయడంతో పాటు అభిమానులు, ప్రజలు జ‌గ‌న్‌పై పువ్వులు విసరడాన్ని కూడా అనుమ‌తించ‌డం లేదు. అయితే జ‌గ‌న్ మాత్రం అంద‌రని క‌లుసుకుంటూ ప్రేమగా ముందుకు సాగుతున్నారు. అయితే త‌న బస్సుయాత్రకు వస్తున్న ఆదరణను చూసి.. దాడులు చేయాలని చూస్తున్నారని జ‌గ‌న్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని.. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయ‌ని జ‌గ‌న్ తెలియ‌జేశారు.

YS Jagan : సీఎం జగన్ పై దాడి ఘటనపై సీపీ ఏమ‌న్నారంటే..

అయితే రాయి దాడి జరిగిన ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడ పర్యటనలో జ‌గ‌న్‌కి తగినంత భద్రత కల్పించామని వెల్లడించారు. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్ల బలగాలను సీఎం భద్రతకు కేటాయించామని, వాటికితోడు ఆక్టోపస్, సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఉంటుంద‌ని తెలియ‌జేశారు. అయితే ముఖ్యమంత్రి యాత్రలో విద్యుత్‌ నిలిపివేయడంపై సీపీ స్పందిస్తూ.. అది సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగ‌మ‌ని తెలియ‌జేశారు. జ‌గ‌న్ వెళ్లే మార్గ‌లంలో క‌రెంట్ ఎందుకు తీసేసార‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఆ రూట్‌లో కరెంట్‌ లైన్లు, కేబుల్‌ లైన్లు ఎక్కువగా ఉన్నాయి.

YS Jagan ఎట్ట‌కేల‌కి జ‌గ‌న్ వెళ్లే మార్గంలో క‌రెంట్ నిలిపివేయ‌డానికి కార‌ణం చెప్పిన సీపీ

YS Jagan : ఎట్ట‌కేల‌కి జ‌గ‌న్ వెళ్లే మార్గంలో క‌రెంట్ నిలిపివేయ‌డానికి కార‌ణం చెప్పిన సీపీ..!

అయితే విద్యుత్ తీగలు తొలగించడం కుదరదు కాబ‌ట్టి.. రూఫ్‌టాప్‌ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ నిలిపివేయడం సర్వసాధారణంగా జ‌రిగేదే అని ఆయ‌న చెప్పారు. అయితే సీఎం పర్యటనకు ఒక రోజు ముందే కేబుల్‌ లైన్లు తీసేశామని.. రూఫ్‌టాప్‌కి విద్యుత్‌ వైర్లు తగిలే అవ‌కాశం ఉండ‌డంతో భద్రత కోసమే విద్యుత్‌ నిలిపివేశామన్నారు. అయితే చీకట్లో, గుంపు బాగా ఉండటం చూసుకొని దుండగుడు జ‌గ‌న్‌పై రాయి విసిరాడ‌ని అన్నారు సీపీ. అయితే రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌పై పడిందని.. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కూడా ఆయ‌న తెలియ‌జేశారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది