Vijaysai Reddy : నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తా.. ఆ సత్తా నాకుంది.. విజయసాయిరెడ్డి కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijaysai Reddy : నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తా.. ఆ సత్తా నాకుంది.. విజయసాయిరెడ్డి కామెంట్స్..!

Vijaysai Reddy : ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే… ఇటు ఏపీలో మాత్రం ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో ఇక్కడ ఏం జరుగుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక ఏపీలో మరోసారి వైసీపీ గాలి వీస్తుందని సర్వేలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ సీట్లు కూడా వైసీపీనే ఎక్కువగా గెలుచుకుంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు కుడిభుజంగా ఉండే […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijaysai Reddy : నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తా.. ఆ సత్తా నాకుంది.. విజయసాయిరెడ్డి కామెంట్స్..!

Vijaysai Reddy : ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే… ఇటు ఏపీలో మాత్రం ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో ఇక్కడ ఏం జరుగుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక ఏపీలో మరోసారి వైసీపీ గాలి వీస్తుందని సర్వేలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ సీట్లు కూడా వైసీపీనే ఎక్కువగా గెలుచుకుంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు కుడిభుజంగా ఉండే విజయసాయిరెడ్డి మీదనే అందరి దృష్టి పడింది. నెల్లూరు నెంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన చాలానే హామీలు ఇస్తున్నారు.

Vijaysai Reddy : కేవలం ఎంపీగానే..

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం నెల్లూరుకు ఎయిర్ పోర్టు తేవడం. ఇప్పటి వరకు విశాఖపట్నంకు తప్ప ఏపీలో ఎక్కడా కూడా ఎయిర్ పోర్టు లేదు. అలాంటిది ఆయన నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తానని చెప్పడం మాత్రం అందరికీ షాకింగ్ గానే ఉంది. ఒక ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇంత పెద్ద హామీ ఇవ్వడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గెలిచినా సరే అటుకేంద్రంలో ఎలాంటి పదవి రాదు. కేవలం ఎంపీగానే ఉంటారు. అలాంటిది తననను గెలిపిస్తే నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తానని ఆయన చెప్పడం ఒక షాక్.

Vijaysai Reddy నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తా ఆ సత్తా నాకుంది విజయసాయిరెడ్డి కామెంట్స్

Vijaysai Reddy : నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తా.. ఆ సత్తా నాకుంది.. విజయసాయిరెడ్డి కామెంట్స్..!

అయితే దానిపై తాజా ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. మీరు నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తానని చెప్పారు అది అసలు సాధ్యమేనా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అది కచ్చితంగా సాధ్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎనిమిదేండ్లుగా ఎంపీగా పని చేశారు. నాకు కేంద్రంలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి. బీజేపీలో ఉండే కేంద్ర మంత్రులు కూడా నాకు చాలా సపోర్టివ్ గానే ఉంటారు. అంతే కాకుండా చాలా పనులు కూడా నాకు చేసి పెడుతారు. నాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సపోర్టు కూడాచాలానే ఉంది. కాబట్టి నాకు ఎయిర్ పోర్టు తెప్పించడం పెద్ద కష్టమేం కాదు. అందుకే నేను ఎంపీ ఎన్నికల్లో ఆ హామీని ఇచ్చాను. ఇప్పటి వరకు నేను ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాను. ఇప్పుడు ఈ హామీ కూడా నెరవేరుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు విజయసాయిరెడ్డి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది