Vundavalli Arun Kumar : కేసీఆర్ చేసిన తప్పులే జగన్ చేస్తున్నాడు.. అందుకే ఓటమి అంచుల్లో జగన్.. ఉండవల్లి వ్యాఖ్యలు వైరల్
ప్రధానాంశాలు:
అన్ని చోట్ల యాంటీ ఇన్ కంబెన్సీ ఉంటుంది
హైదరాబాద్ లో సాయంత్రం వరకు 30 శాతం కూడా పోలింగ్ కాలేదు
పేదలు నిజాయితీగా ఓటేస్తారు
Vundavalli Arun Kumar : ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. సిట్టింగ్ లను మార్చి వేరే వాళ్లకు టికెట్స్ ఇవ్వనున్నారని వైసీపీ పార్టీలో సరికొత్త మార్పులను జగన్ శ్రీకారం చుట్టారని ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. అన్ని చోట్ల యాంటీ ఇన్ కంబెన్సీ ఓట్లు ఉంటాయి. ఏపీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవడం వాళ్లకే ప్లస్ అవుతుంది. చంద్రబాబు చేసిన పని ఎవ్వరూ చేయలేదు. అప్పులు చేసి బిలో పావర్టీ వాళ్లకు పంచారు. మనకు వచ్చిన రెవెన్యూ అంతా ప్రజలకు ఇచ్చేస్తే వాళ్లకు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడానికే ఇష్టపడతాడు.. పొలిటిషియన్ కొడుకు పొలిటిషియన్ అవుతున్నారు. సినిమా యాక్టర్ల కొడుకులు సినిమా యాక్టర్లే అవుతున్నారు.. ఎందుకంటే ఇందులో బాగా ఆదాయం ఉంది అంటూ ఉండవల్లి అన్నారు.
పేదవాళ్లు ద్రోహం చేయలేరు. వాళ్లు ఏదో కూలి పని చేసుకొని బతుకుతారు. 99 శాతం పేదలు నీతిగా నిజాయితీగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేసి బతుకుతారు కానీ.. డబ్బులు తీసుకొని వాళ్లకే వేస్తారు. హైదరాబాద్ లో పోలింగ్ 30 శాతం కూడా కాలేదు. తర్వాత ఏమైంది అంటే.. డబ్బులు ఇవ్వలేదని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఓటేయడానికి వెళ్లలేదు. డబ్బులు పంచాక అప్పుడు బయటికి వెళ్లారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటితే అప్పులు ఇవ్వరు. వేరే చోట తెస్తున్నారు అప్పులు. అసెంబ్లీలో మనోళ్లు దెబ్బలాడుకోరు. కానీ.. తెలంగాణలో వాళ్లు అసెంబ్లీలోనే దెబ్బలాడుకుంటున్నారు అంటూ ఉండవల్లి స్పష్టం చేశారు.
Vundavalli Arun Kumar : కేంద్రం అప్పులను ఎందుకు ప్రశ్నించరు?
చంద్రబాబు, జగన్ ఎవ్వరైనా కేంద్రం ఎలా అప్పులు చేస్తోందని అడగరు. ఆయన అప్పు చేశారని ఈయన.. ఈయన అప్పు చేశారని ఆయన అంటారు తప్పితే కేంద్రం కూడా అప్పు చేస్తోందని అనరు. అప్పు రెండు రకాలు ఉంటుంది. రెవెన్యూ ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు రెండు ఉంటాయి. క్యాపిటల్ ఖర్చు 25 శాతం వరకు కూడా లేదు. ఇప్పుడు ఉన్నది రెవెన్యూ ఖర్చు మాత్రమే. అందుకే అప్పులు కుప్పలుగా అవుతున్నాయి అన్నారు.