Vundavalli Arun Kumar : అడ్డంగా దొరికేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ?

 Authored By siddhu | The Telugu News | Updated on :19 February 2026,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Vundavalli Arun Kumar : అడ్డంగా దొరికేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ?

Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజకీయాల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్  తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు Ambati Rambabu విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆయన నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద అంబటి రాంబాబు పచ్చి బూతులతో విరుచుకుపడితే అది ఏదో పొరపాటున నోరు జారినట్టు లేదా తనలో తాను అనుకున్న మాటలు బయటికి వినబడినట్టు ఉండవల్లి చిత్రించడం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కారు అద్దం దించి మరీ మీడియా ముందు కేకలు వేస్తూ దూషించిన విషయాన్ని ఇంత సులభంగా సమర్థించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. నిజంగానే అంబటి రాంబాబు తనలో తాను అనుకున్న మాటలు అయితే అవి మీడియా మైకులకు అంత స్పష్టంగా ఎలా వినిపిస్తాయని సామాన్య జనం కూడా ప్రశ్నిస్తున్నారు. ఉండవల్లి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి అడ్డగోలు వాదనలు చేయడం ఆయన స్థాయికి తగదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Vundavalli Arun Kumar : అడ్డంగా దొరికేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ?

Vundavalli Arun Kumar : అడ్డంగా దొరికేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ?

Vundavalli Arun Kumar  : మేధావుల ముసుగులో జరుగుతున్న రాజకీయాలు

గతంలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదే మేధావి మౌనంగా ఉండిపోయారని ఇప్పుడు అంబటి రాంబాబుని కాపాడడానికి మాత్రం మీడియా ముందుకు రావడం ఆయన పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. అప్పట్లో అమరావతి రైతులు సమస్యల మీద స్పందించమని కోరితే తనకు రాజకీయాలు సంబంధం లేదని తప్పించుకున్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ నాయకుల తప్పులను కప్పిపుచ్చడానికి ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అలాగే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దేవుడితో రాజకీయాలు చేయొద్దు అని నీతులు చెబుతున్న ఉండవల్లి గతంలో పింక్ డైమండ్ విషయంలో చంద్రబాబు కుటుంబం మీద తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. ఆ రోజు లేని భక్తి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చిందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్టు నటిస్తూ కేవలం వైఎస్ కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆయన ఒక కట్టుబానిసలా మారిపోయారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రానికి మేలు చేసే విషయాల్లో గొంతు విప్పని మేధావులు ఇలాంటి బూతు పురాణాలను సమర్థించడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు.

కేవలం మీడియా చర్చల్లో కూర్చుని ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల మేధావి అనిపించుకోరని వాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ధైర్యం ఉండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంబటి రాంబాబు జైలులో కన్నీళ్లు పెట్టుకున్నారని ఉండవల్లి చెప్పడం కూడా ఒక డ్రామా లాగే ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ తన మాటలతో వైసీపీకి మేలు చేయాలని చూస్తున్నా అది రివర్స్ అయ్యి ఆయన పరువునే తీస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు సమర్థనల వల్ల మేధావుల మీద ఉన్న గౌరవం తగ్గిపోతోందని సమాజం ఆందోళన చెందుతోంది. ఒక నాయకుడు బహిరంగంగా బూతులు తిడితే దాన్ని ఖండించాల్సింది పోయి తనలో తాను అనుకున్నాడు అని చెప్పడం అనేది కేవలం అమ్ముడుపోయిన వారు చేసే పని అని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయన వయసుకు తగ్గట్టుగా నిజాయితీగా మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి