Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల ప్రాజెక్టు పై మరింత స్పష్టత ఇచ్చారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు రాయలసీమకు 200 టీఎంసీల నీటిని రిజర్వ్ చేయాలని ప్రతిపాదించారని, సముద్రంలో వృథా కావడాన్ని నివారించేందుకు పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ కు చెప్పినట్లు నిమ్మల క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తయ్యితే రాయలసీమలో రైతులకు గొప్ప భరోసా లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు
బనకచర్ల ప్రాజెక్టు అమలవ్వడం ద్వారా రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్.. అదే సీమ అభివృద్ధికి అడ్డుపడతున్నారు. బనకచర్లపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు,’’ అని మండిపడ్డారు. ముఖ్యంగా వరద జలాలను వృథా కాకుండా వినియోగించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాలన్న ఉద్దేశమని తెలిపారు.
ప్రాజెక్టుల ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టంచేశారు. వరద కాలంలో సముద్రంలో కలిసిపోతున్న మిగులు జలాలను వినియోగించడంలో బనకచర్ల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే, జగన్ మిగులు జలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించడం మానవీయతకు, రైతుల పట్ల బాధ్యతకు విరుద్ధమని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై జగన్‌కు కనీస అవగాహన లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వ్యతిరేకిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.