Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్‌.. అదే సీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు

  •  సీఎం రేవంత్ కు బనకచర్ల ప్రాజెక్ట్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చాం - మంత్రి నిమ్మల

  •  Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల ప్రాజెక్టు పై మరింత స్పష్టత ఇచ్చారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు రాయలసీమకు 200 టీఎంసీల నీటిని రిజర్వ్ చేయాలని ప్రతిపాదించారని, సముద్రంలో వృథా కావడాన్ని నివారించేందుకు పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ కు చెప్పినట్లు నిమ్మల క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తయ్యితే రాయలసీమలో రైతులకు గొప్ప భరోసా లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

Nimmala Ramanaidu బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా చంద్రబాబు దేవుడు కాబోతున్నాడు

బనకచర్ల ప్రాజెక్టు అమలవ్వడం ద్వారా రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్‌.. అదే సీమ అభివృద్ధికి అడ్డుపడతున్నారు. బనకచర్లపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు,’’ అని మండిపడ్డారు. ముఖ్యంగా వరద జలాలను వృథా కాకుండా వినియోగించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాలన్న ఉద్దేశమని తెలిపారు.

ప్రాజెక్టుల ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టంచేశారు. వరద కాలంలో సముద్రంలో కలిసిపోతున్న మిగులు జలాలను వినియోగించడంలో బనకచర్ల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే, జగన్ మిగులు జలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించడం మానవీయతకు, రైతుల పట్ల బాధ్యతకు విరుద్ధమని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై జగన్‌కు కనీస అవగాహన లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వ్యతిరేకిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది