Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu : గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా ప్ర‌జా స‌మ‌స్య‌లు ఆల‌కించ‌క‌, వారు చెబితే విన‌కుండా ఉంటే తిరిగి అధికారంలోకి రాలేమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. సోమ‌వారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల‌ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,7:00 am

Chandrababu Naidu : గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా ప్ర‌జా స‌మ‌స్య‌లు ఆల‌కించ‌క‌, వారు చెబితే విన‌కుండా ఉంటే తిరిగి అధికారంలోకి రాలేమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. సోమ‌వారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల‌ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలని వారికి సూచించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్ట‌క ముందు నుంచే అధికారులతో ఆయ‌న మమేకమవుతున్న సంగతి తెలిసిందే. పాలన ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత పలు విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా సోమ‌వారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న ఆయ‌న విమర్శించారు. గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రా ఐఏఎస్ అధికారులు జగన్ పాలనలో అపఖ్యాతి పాలయ్యారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరును బట్టి కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గ‌మ‌నించాల‌ని పేర్కొన్నారు.

Chandrababu Naidu వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు

రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ల సదస్సు నాంది పలకాలని చంద్ర‌బాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా భూ సమస్యలపైనే ఉన్న‌ట్లు తెలిపిన ఆయ‌న వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అధికారుల‌కు సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంపద సృష్టికి కొత్త విధానాలు, నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, ఎమ్మెల్యేలు చెబితే వినాలన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకి పోలేమన్నారు. పరదాలు కట్టడాలు, రోడ్ బ్లాక్ చేయడాలు వంటివి చేయవద్దన్నారు. ప్రభుత్వం అంతరంగాన్ని అనుసంధానం చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేస్తామని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది