
Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : గత ప్రభుత్వం మాదిరిగా ప్రజా సమస్యలు ఆలకించక, వారు చెబితే వినకుండా ఉంటే తిరిగి అధికారంలోకి రాలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలని వారికి సూచించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టక ముందు నుంచే అధికారులతో ఆయన మమేకమవుతున్న సంగతి తెలిసిందే. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పలు విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న ఆయన విమర్శించారు. గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రా ఐఏఎస్ అధికారులు జగన్ పాలనలో అపఖ్యాతి పాలయ్యారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరును బట్టి కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలని పేర్కొన్నారు.
Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు
రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ల సదస్సు నాంది పలకాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా భూ సమస్యలపైనే ఉన్నట్లు తెలిపిన ఆయన వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంపద సృష్టికి కొత్త విధానాలు, నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, ఎమ్మెల్యేలు చెబితే వినాలన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకి పోలేమన్నారు. పరదాలు కట్టడాలు, రోడ్ బ్లాక్ చేయడాలు వంటివి చేయవద్దన్నారు. ప్రభుత్వం అంతరంగాన్ని అనుసంధానం చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.