Shravana Masam 2024 : శ్రావణ మాసం వచ్చింది అంటే తెలుగు లోగిళ్లలో పండుగ సంబరాలు మొదలైనట్టే. ఈ నెల నుంచి పండుగలు శుభారంభం అవుతాయి. ఐతే మన వాళ్లకు పండుగ అంటే చాలు ముందు బంగారాన్ని ఇంటికి తెచ్చుకుందాం అన్నట్టుగా ఉంటుంది. ఓ పక్క గోల్డ్ రేటు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. మొన్నటిదాకా తులం 70, 75 వేల దాకా వెళ్లిన బంగారం రేటు కేంద్రం సుంకం తగ్గించడం వల్ల రేటు తగ్గింది. అంతేకాదు బులియన్ మార్కెట్ దూసుకుపోవడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ బంగారం మీద పడింది. ప్రస్తుతం 6 వేల దాకా తగ్గి 65 వేలకు అటు ఇటుగా ఉంది. ఐతే ఇలాంటి టైం లోనే శ్రావణ మాసం వచ్చింది కాబట్టి బంగారం కొనేందుకు ఇదే మంచి టైం అని అంటున్నారు. మళ్లీ రేటు పెరిగే వరకు వెయిట్ చేయకుండా బంగారు నగలు ఇంటికి తెచ్చుకుంటే బెటర్ అని అంటున్నారు. ఇదే కాదు వెండి మీద కూడా రేటు తగ్గింది. మొన్నటిదాకా కిలో లక్ష దాకా ఉన్న వెండి కొంత తగ్గుముఖం పట్టింది.
ఐతే చేతిలో డబ్బులు లేకపోయినా బంగారం ఎలా కొనాలంటే కొత్త ఐడియాలు ఇస్తున్నారు కొందరు నిపుణులు. ఏముంది ఇంట్లో పాత బంగారం ఉంటుంది. దాన్ని బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుని ఆ డబ్బుతో కొత్త బంగారం తీసుకోవచ్చు అంటున్నారు. నెల నెల వడ్డీ కూడా ఖర్చు లేదు కాబట్టి బ్యాంక్ లో పెట్టిన బంగారం కోసం కొంత వాయిదా పద్ధతిలో పే చేస్తూ దాన్ని విడిపించుకోవచ్చు.
ఐతే పాత బంగారం ఎంత ఉందో దానికి ప్రస్తుతం ఇస్తున్న బ్యాంక్ రేటు సరిచూసుకుని లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే బ్యాంక్ లోన్ తీసుకుని ఇప్పుడు తగ్గిన బంగారం రేటుతో కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో రేటు పెరిగినా బాధపడాల్సిన అవసరం ఉండదు. సో చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ నెల లో బంగారం కొనే ప్లాన్ చేయొచ్చని అంటున్నారు. ఐతే ఇలా లోన్ తీసుకుని ఉన్న బంగారం తాకట్టు పెట్టడం ఇష్టం లేని వారు తమ దగ్గర ఉన్న మొత్తం తో అయినా బంగారం కొనుగోలు చేయొచ్చు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.