AP Weather : ఏపీ వాసుల‌కి నిజంగా ఇది శుభ‌వార్త‌.. రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 16, 2024, 6:00 pm
  •  AP Weather : ఏపీ వాసుల‌కి నిజంగా ఇది శుభ‌వార్త‌.. రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు..!

AP Weather : గ‌త కొద్ది రోజులుగా ఉక్క‌పోత‌తో ఉడికిపోతున్న తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. రాయలసీమ నుంచి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతున్న నేప‌థ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

AP Weather గుడ్ న్యూస్..

సోమ‌వారం భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు ఇక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలు హైదారాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

AP Weather : ఏపీ వాసుల‌కి నిజంగా ఇది శుభ‌వార్త‌.. రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు..!

AP Weather : ఏపీ వాసుల‌కి నిజంగా ఇది శుభ‌వార్త‌.. రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు..!

రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీంతో ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయని వెల్లడించింది. ఈ చ‌ల్లని క‌బురుతో తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp