Janasena and TDP : చంద్రబాబుకు కష్టం.. జనసేనకు ఇష్టం.. సీట్ల విషయంలో ఏం జరుగుతుంది ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janasena and TDP : చంద్రబాబుకు కష్టం.. జనసేనకు ఇష్టం.. సీట్ల విషయంలో ఏం జరుగుతుంది ..??

 Authored By anusha | The Telugu News | Updated on :19 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Janasena and TDP : చంద్రబాబుకు కష్టం.. జనసేనకు ఇష్టం.. సీట్ల విషయంలో ఏం జరుగుతుంది ..??

Janasena and TDP : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చింది. వద్దు వద్దు అనుకొని మరి జనసేనతో పొత్తు పెట్టుకుంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా పరిస్థితి తయారయింది. ఎన్డీఏ లో జనసేన భాగస్వామ్యం అంటూ ఆ పార్టీకి 8 సీట్లు అంటూ బీజేపీ కేటాయించింది. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీ భావించింది. అయితే జనసేనతో పొత్తు కుదుర్చు కోవటం వలన రాజకీయంగా నష్టమే తప్ప లాభం లేదని ఇటీవల వెల్లడైన ఫలితాలు నిరూపించాయిష కనీసం బర్రెలక్క ఇమేజ్ పవన్ కు రాజకీయంగా లేదు అని తేలిపోయింది. డిపాజిట్లు కూడా రాని స్థాయిలో పవన్ కళ్యాణ్ గ్లామర్ పడిపోయిందని బిజెపిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.జనసేనకు ఒక సిద్ధాంతం, విధానం లేదని, అలాగే పవన్ కు నిలకడ లేదు అని బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయ పడినట్లు తెలుస్తుంది. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎటు గెలవలేమని ఉద్దేశంతోనే ఏమాత్రం బలం లేని జనసేన తో పొత్తు పెట్టుకున్నారని ప్రతికూల ప్రచారం ఎన్నికల్లో బిజెపిని దెబ్బతీసినట్లు ఒక అంచనాకి వచ్చారు.

అందులో లోక్ సభ ఎన్నికల్లో పవన్ తో సర్దుబాటు వద్దని బిజెపి నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బాబు నీకు ఒక దండం అంటూ పవన్ కు ఆయన సంకేతం ఇచ్చినట్లు అయింది. ఇక అర్థం చేసుకోవడం జనసేన వంతుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ఏపీలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. దీంతో టీడీపీ అధినేతకి అభిమానం పెరిగింది. అందుకే పరస్పర సంప్రదింపులు పొత్తులను సీట్ల సర్దుబాటులతో ఖరారు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. జనసేనకు 15 నుంచి 20 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు టిడిపి రెడీగా ఉంది. అయితే ఆ సంగతిని ప్రస్తుతానికి పక్కన పెట్టి లోక్సభ స్థానాలపై ఒక క్లారిటీ కి రావాలని టీడీపీ భావిస్తుంది. ఆ దిశగా జనసేన నాయకుడు చర్చలు జరుపుతుంది. బిజెపి దాదాపు 5 లోపు లోక్సభ స్థానాలను కేటాయించేందుకు సిద్ధమైన టీడీపీ ఇప్పుడు మూడు సీట్లు ఇస్తామంటూ సందేశాలు పంపుతుంది. ప్రాథమిక దశలో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వాటిలో ఒకటి ఉత్తరాంధ్రలో, మరొకటి గోదావరి జిల్లాలో, ఇంకొకటి దక్షిణ కోస్తాలో ఇస్తారని చర్చ జరుగుతుంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి ఎంపీ సీటును జనసేనకి వదిలే అవకాశం ఉందని తెలుస్తుంది. అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి ఇంకా దొరకలేదు. అందుకే ఈ సీటును జనసేనకు విడిచి పెట్టాలని చూస్తుంది.

ప్రజారాజ్యం టైంలో ఇక్కడ అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన బరిలోకి దిగవచ్చు. ఆస్థానం కోసం జనసేనలో చాలామంది పోటీ పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఒక్క ఎంపీ సీటును జనసేనకు వదిలే ఆలోచన టిడిపి లేనట్లుగా ఉంది. అందుకే పశ్చిమగోదావరిలో ఇవ్వాలని చూస్తున్నా మరి ఇక్కడి నుంచి నాగబాబు పోటీ చేస్తారా లేక వేరే వాళ్ళు చేస్తారా అనేది చూడాలి. నిజానికి పవన్ కళ్యాణ్ 5 ఎంపీ సీట్లను ఆశిస్తున్నారు. అయితే అది కుదరని పని అని మూడు సీట్లకు మించి ఇవ్వలేమని టిడిపి అంటుంది. ఫైనల్ గా నాలుగు స్థానాలకు సెటిల్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే టీడీపీకి ఎంపీ అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది. ఏదేమైనా టిడిపి జనసేన గాఢంగా బంధం పెను వేసుకుపోయాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది