Thanuja – Kalyan : తనూజ , కళ్యాణ్ స్టేజీ ఎక్కగానే ఏం జరిగిందో చూడండి .. శ్రీముఖి అంత మాట అనేసింది ఏంటి

 Authored By siddhu | The Telugu News | Updated on :16 February 2026,6:15 pm

ప్రధానాంశాలు:

  •  Thanuja - Kalyan : తనూజ , కళ్యాణ్ స్టేజీ ఎక్కగానే ఏం జరిగిందో చూడండి .. శ్రీముఖి అంత మాట అనేసింది ఏంటి

Thanuja – Kalyan : బిగ్‌బాస్ సీజన్-9 Bigg Boss session 9 ముగిసి రెండు నెలలు దాటినా, కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ తనూజ గౌడ జోడీకి సోషల్ మీడియాలో Social Media  భారీ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ ఏ షోలో కనిపించినా రేటింగ్స్ అదిరిపోతుండటంతో, స్టార్ మా యాజమాన్యం సీజన్-9 కంటెస్టెంట్లతో ‘బీబీ ఉత్సవం’ పేరుతో ఒక గ్రాండ్ రీయూనియన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. తాజాగా విడుదలైన ఈ షో ప్రోమోలో నాగార్జున చీఫ్ గెస్టుగా విచ్చేసి సందడి చేయడం విశేషం.

Thanuja - Kalyan : తనూజ , కళ్యాణ్ స్టేజీ ఎక్కగానే ఏం జరిగిందో చూడండి .. శ్రీముఖి అంత మాట అనేసింది ఏంటి

Thanuja – Kalyan : తనూజ , కళ్యాణ్ స్టేజీ ఎక్కగానే ఏం జరిగిందో చూడండి .. శ్రీముఖి అంత మాట అనేసింది ఏంటి

Thanuja – Kalyan : Winner vs Runner

ఈ వేడుకలో యాంకర్ శ్రీముఖి తనదైన శైలిలో సందడి చేస్తూ, ఇది కేవలం రీయూనియన్ మాత్రమే కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పండగ అని అభివర్ణించారు. ఈ ఈవెంట్‌కు నిఖిల్, శివాజీ వంటి స్టార్లు తమ సినిమా ప్రమోషన్ల కోసం విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్లు అందరూ ఒకే వేదికపైకి వచ్చి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్యంగా తనూజ రాగానే నేను రన్నరప్, ఈమె రన్నరప్, ఇద్దరం రన్నరప్.. అంటూ శ్రీముఖి హగ్గు ఇచ్చింది. శ్రీముఖి రన్నరప్ అంటే ఆడియన్స్‌లో విన్నర్ అని అర్థం.. అంటూ రీతూ చౌదరి కామెంట్ చేసింది. అది ఎవరు చెప్తున్నారు టాప్-5కి రానివాళ్లు చెప్తున్నారు.. అంటూ రీతూ పరువు తీసింది శ్రీముఖి.

ప్రోమోలో దివ్వెల మాధురి తన వైరల్ డైలాగ్స్‌ను రీక్రియేట్ చేయగా, ఇమ్మూ తనదైన కామెడీ పంచ్‌లతో అందరినీ నవ్వించాడు. ప్రియ తన అందం గురించి, ఇమ్మూ తన ఫ్యాన్ బేస్ గురించి చేసిన కామెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు కళ్యాణ్, మాధురి తమ మధ్య జరిగిన పాత గొడవ సీన్‌ను సరదాగా స్టేజ్ మీద చేసి చూపించారు. ఇక ట్రూత్ ఆర్ డేర్ టాస్క్‌లో భాగంగా రీతూ చౌదరి, తాను పవన్ కుమార్ ఉప్పల (డీమాన్)ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే వీరిద్దరూ, కళ్యాణ్-తనూజ జంటలతో కలిసి డ్యాన్స్ చేసి అలరించారు.

చివరిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చి షోలో మరింత జోష్ నింపారు. వీకెండ్ ఎపిసోడ్లలో కంటెస్టెంట్లతో ఆటలు ఆడించే నాగ్, ఇక్కడ మాత్రం “నేనెక్కడ ఆడాను.. వాళ్లే నాతో ఆటలు ఆడారు” అంటూ చమత్కరించారు. ఇదే సమయంలో ఎక్స్‌ప్రెస్ హరి తాను ‘సీజన్-10 కంటెస్టెంట్‌’ని అని చెప్పడంతో నాగార్జున ఒక్క క్షణం షాక్‌కు గురయ్యారు. మొత్తం మీద ఈ ‘బీబీ ఉత్సవం’ ప్రోమో పాత కంటెస్టెంట్ల అల్లరితో, కొత్త ప్రేమ ముచ్చట్లతో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి