Ap Surveys : ఏపీ ఎన్నికల ఫలితాలు.. మస్తాన్ వర్సెస్ వేణుస్వామి..!
Ap Surveys : మరి కొద్ది గంటలలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల ఫలితాలకి ముందు ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. పుట్టగొడుగుల మాదిరిగా ప్రతి సంస్థ సర్వేలు అంటూ ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అయితే ఏదో తూతూ మంత్రంగా చెప్పుకొస్తే మరి కొందరు మాత్రం బాగా పరిశీలనలు జరిపి జాతకాలు చెప్పారు. అయితే ఆరా సంస్థ మస్తాన్ మీద మాత్రం […]
ప్రధానాంశాలు:
Ap Surveys : ఏపీ ఎన్నికల ఫలితాలు.. మస్తాన్ వర్సెస్ వేణుస్వామి..!
Ap Surveys : మరి కొద్ది గంటలలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల ఫలితాలకి ముందు ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. పుట్టగొడుగుల మాదిరిగా ప్రతి సంస్థ సర్వేలు అంటూ ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అయితే ఏదో తూతూ మంత్రంగా చెప్పుకొస్తే మరి కొందరు మాత్రం బాగా పరిశీలనలు జరిపి జాతకాలు చెప్పారు. అయితే ఆరా సంస్థ మస్తాన్ మీద మాత్రం చాలా మంది ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఏం చెబుతారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. వరసబెట్టి యూట్యూబ్ చానల్స్ ఆరా మస్తాన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఆయన తన సర్వే నూరు శాతం నిజం తప్పు అయితే మీడియాకే ముఖం చూపించను అంటూ సవాల్ కూడా చేశారు.
Ap Surveys ఎవరు గెలుస్తారు..
అయితే ఆరా మస్తాన్ వైసీపీలో పలువరు నాయకులకి టెన్షన్‌కి కూడా గురి చేశారు.తెలంగాణ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ చేయడం సాధ్యం కాదన్న ఆరా మస్తాన్.. ఇవన్నీ ప్రీ పోల్ సర్వేలే అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఆయన పోలింగ్ సరళిని విశ్లేషించుకొని చెప్పడంలేదని అర్థమవుతోందనంటున్నారు. మస్తాన్ చెప్పినవి వైసీపీలో ఆనందాన్ని నింపితే, 2014 ఎన్నికల్లో ఇదే మస్తాన్ చెప్పినది తప్పైందంటూ టీడీపీ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అయిన తరువాత ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. వీరంతా ఇపుడు సర్వేలు చూసి చెబుతున్నారు తాను నాలుగేళ్ళ క్రితమే జగన్ మరోసారి సీఎం అని చెప్పేశాను అని క్రెడిట్ తీసుకున్నారు.
జగన్ కి 17 ఏళ్ల పాటు రాజయోగం ఉందని అది 2019 నుంచి స్టార్ట్ అయిందని ఆయన 2029లో కూడా మరో సారి సీఎం అంటూ సరికొత్త జోస్యం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు వేణు స్వామి.సర్వేలు, అందరు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని..కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నారనని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. మరి ఆరా మస్తాన్ సర్వేలు అన్ని సక్సెస్ కాగా, మరోవైపు వేణు స్వామి జాతకం కూడా పలుమార్లు నిజమైంది. మరి ఫైనల్‌గా ఎవరి సర్వే సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.