Gannavaram : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత దారుణంగా దూషించారు. బూతులతో విరుచుకుపడ్డారు. టిడిపి నాయకత్వం లేదన్నారు. కానీ టీడీపీ లో యార్లగడ్డ వెంకట్రావు చేరడంతో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ప్రస్తుతం వంశీకి గడ్డు పరిస్థితి ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాట్ నియోజకవర్గాలలో గన్నవరం కూడా ఒకటి. ఇక ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీకి మారిపోయారు. అయితే ఆయనకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపి పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీ చేస్తున్నారు. కానీ ఇరువురు పార్టీలు మార్పు. ఇక వల్లభనేని వంశీకి వైసీపీలో పలు వర్గాలు వ్యతిరేకంగా ఉంటే , తెలుగుదేశం పార్టీలో మాత్రం యార్లగడ్డ వెంకట్రావు వెనక క్యాడర్ అంతా నిలబడ్డారు. అయితే 1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. పుచ్చలపల్లి వెంకటయ్య , కాకాని వెంకటరత్నం లాంటి దిగ్గజాలు ఈ నియోజకవర్గ నుండే ప్రాతినిధ్యం వహించారు. అయితే ఎప్పటినుండో గన్నవరం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ముద్ర ఏర్పడింది.
చివరిసారిగా 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించింది. ఆ తర్వాత రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 2009 నుండి ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ గన్నవరంలో విజయం సాధించింది. అయితే గన్నవరం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. సామాజిక వర్గ పరంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. టిడిపి ఓడిపోయిన తర్వాత వంశి అనేక సవాలు ఎదుర్కోవాలని తెలిసిన వైసీపీలో చేరిపోయాడు. పార్టీలో తరచుగా విభేదాలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ నేత దుట్ట రామచంద్రారావు వంశీకి సహకరించడం లేదు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం గన్నవరం బాధ్యతలు వంశి కే అప్ప చెప్పింది. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయననే బరిలో దించాలని ఆలోచనలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో నెలకొన్న విభేదాల గురించి అనేకసార్లు పార్టీ పెద్దలు చర్చించడం జరిగింది.
అయినప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. దీంతో చివరికి యాళ్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరిపోయారు. ఇక ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆయన కుటుంబాన్ని దూషించటం ఎమ్మెల్యే వంశీకి మైనస్ అని చెప్పాలి. సామాజిక వర్గం మొత్తం వెలి వేసినట్లు కనిపించడంతో తరువాత ఆయన మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. కానీ జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేసినా వ్యర్థమే అనిపిస్తుంది. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గం అంతా దాదాపు వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. ఇక టిడిపి పార్టీ యార్లగడ్డ వెంకట్రావు సహజంగానే దూకుడుగా వ్యవహరించే వ్యక్తి.గత ఎలక్షన్స్ లో కూడా స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. సామాజిక వర్గ పరంగా వైసీపీకి దూరంగా ఉండే ప్రాంతంలోనే ఆయన గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ఆయన టిడిపి తరఫున బరిలోకి దిగుతున్నారు. టిడిపి పార్టీలో చేరినప్పటి నుండి వంశీ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో వంశీని వ్యతిరేకించే వారందరూ యార్లగడ్డ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక వంశీ పై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరం గా మారాయి అని చెప్పాలి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.