
Ram Gopal Varma : ఇండస్ట్రీ పెద్దలకి హనుమాన్ సరైన సమాధానం - రాంగోపాల్ వర్మ..!
Ram Gopal Varma : తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హనుమాన్ ‘ సినిమా సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకెళుతోంది. హనుమంతుడి ఆధారంగా వచ్చిన ఈ మైథలాజికల్ సూపర్ హీరో సినిమాకి అద్భుత రెస్పాన్స్ వస్తోంది. హనుమాన్ ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశాంత్ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. ఆలోచన, శక్తి ఉంటే తక్కువ బడ్జెట్ తో కూడా విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే సినిమాలు తెరకెక్కించవచ్చని హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ నిరూపించారని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే వందల కోట్ల బడ్జెట్ అవసరమని భావించే వారికి చంపదెబ్బల హనుమాన్ తీసుకొచ్చారని అన్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ కి పాఠం నేర్పారంటూ ప్రశాంత్ వర్మకు ఆర్జీవి కృతజ్ఞతలు చెప్పారు.
భారీ సినిమాలు పోటీలో ఉన్న హనుమాన్ బ్లాక్ బస్టర్ అవుతుండడం పై ఆర్జీవి అభినందించారు. గొలియత్ ను డేవిడ్ అంత మొందించిన లాంటిదే ఇది అని చెప్పారు. నిరంతర శ్రమ, తెలివి ఉంటే తక్కువ బడ్జెట్ తోనే హనుమాన్ లాంటి సినిమాలు తెరకెక్కించవచ్చని ప్రశాంత్ వర్మ చేసి చూపించారు. ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అవడం కన్నా ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పరిమిత బడ్జెట్ లోనే ఈ సినిమా ప్రశాంత్ వర్మ తెరకెక్కించారని మరిచిపోకూడదు. వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే సినిమాలు తీయాలంటే 300 కోట్లు, 500 కోట్లు కావాలని చెబుతుంటారు. అయితే తక్కువ బడ్జెట్ తోనే వీఎఫ్ఎక్స్ హెవీ మూవీ తీయాలంటే తెలివి చాలని ప్రశాంత్ వర్మ నిరూపించారు. సమగ్రత, నిజాయితీ, నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఇది సాధ్యం చేయవచ్చని చెప్పారు అని రాంగోపాల్ వర్మ అన్నారు.
వీఎఫ్ఎక్స్ తో సినిమా తీయాలంటే భారీ బడ్జెట్ కావాలని చెప్పే వారందరికీ హనుమాన్ చంప దెబ్బ లాంటిదని ఆర్జీవి అన్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే భారీ బడ్జెట్ ను సినీ పరిశ్రమ ఇంతకాలం నమ్మిన విషయాలకు ఇది చంప దెబ్బ లాంటిది. అందుకోసం ప్రశాంత్ ను నేను అభినందించాలనుకుంటున్న ఈ సినిమా కోసం మాత్రమే కాదు ఇండస్ట్రీలోని వారికి పాఠం నేర్పినందుకు కూడా వేరే సినిమాల విషయంలో ఇంత బడ్జెట్ ఎందుకు అవుతుందని ఇప్పటినుంచి చాలామంది ప్రశ్నిస్తారు. ఇది నిర్మాతలకు కూడా చాలా మంచి విషయం. ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్ వర్మ కు ధన్యవాదాలు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. హనుమాన్ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అయితే ఈ పరిమిత బడ్జెట్లో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఔట్పుట్ సాధించడం వలన ప్రశాంత్ వర్మ ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో హనుమంతుడు చూపించిన విధానం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
This website uses cookies.