Pawan Kalyan : వారాహి రెండో రౌండ్ యాత్ర మొదలయ్యే టైం కి జగన్ కి భారీ గుడ్ న్యూస్ – పవన్ కి బ్యాడ్ న్యూస్ !

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 7 July 2023, 7:10 pm

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసు కదా. తన తొలి విడత వారాహి యాత్ర తాజాగా ముగిసింది. వారాహి యాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ విమర్శలు. అవును.. వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాన్.. వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టేందుకే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

వారాహి యాత్ర తొలి విడత ముగియడంతో.. రెండో విడత వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. తొలి విడతలో భాగంగా గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. రెండోసారి కూడా అదే గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 9న ఏలూరులో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత తొలి విడతలో కవర్ చేయని ప్రాంతాల్లో రెండో విడతలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.అసలు.. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మీదనే ఎందుకు ఫోకస్ పెట్టారో అర్థం కావడం లేదు. అసలు రాయలసీమలో వారాహి యాత్ర ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. తొలి విడతనే తిరుపతి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. రెండో యాత్ర అయినా తిరుపతి నుంచి ఉంటుందని అనుకున్నారు. అదీ లేదు. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయినా చేయాలి కదా. కానీ.. రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలనే ఎందుకు ఎంచుకున్నారు.

why pawan kalyan is targeting only caste, Telugu News

why pawan kalyan is targeting only caste, Telugu News

Pawan Kalyan : ఎందుకు గోదావరి జిల్లాల మీద ఫోకస్

అంటే.. దాని వెనుక పెద్ద కారణమే ఉందట. పవన్ కళ్యాణ్ కేవలం గోదావరి జిల్లాలనే టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి అర్థం కుల సమీకరణలో భాగమే అని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆ జిల్లాల్లో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అంటే.. కేవలం కులాన్నే నమ్ముకొని పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారా? ఇలా అయితే కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి