Ysrcp
YCP MP : ఇవాళ ఏపీలో ఇదే ట్రెండింగ్ టాపిక్. వైసీపీకి చెందిన వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ కేసును ఛేదించారు. సినీ ఫక్కీలో ఆ నిందితులను ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను రక్షించారు. ఈ ఘటన జరిగినప్పుడు వైజాగ్ ఎంపీ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే వైజాగ్ కు చేరుకున్నారు.
అసలు తన భార్య, కొడుకు, తన ఆడిటర్ ఈ ముగ్గురూ రెండు రోజుల కిందటే కిడ్నాప్ కు గురయ్యారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే హైదరాబాద్ నుంచే పోలీసులతో మాట్లాడుతూ.. కిడ్నాప్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. తనకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ల వివరాలు కూడా ఇచ్చాడు. ఆ వివరాల ప్రకారం.. కిడ్నాప్ ను పోలీసులు ఛేదించిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆయన వైజాగ్ కు వెళ్లారు.
Ysrcp
తన కొడుకుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశానని.. అప్పుడే నా కొడుకు, భార్య కిడ్నాప్ కు గురయ్యారని తెలిసిందన్నారు. దాదాపు 48 గంటలు కిడ్నాపర్లు వాళ్ల ఇంట్లోనే బంధించారు. హేమంత్ అనే రౌడీ షీటర్ పనే ఇది. మరో కిడ్నాప్ కేసులోనూ హేమంత్ దోషిగా ఉన్నాడు. కేవలం డబ్బు కోసమే నా కొడుకు, భార్యను ఆ రౌడీ షీటర్ కిడ్నాప్ చేశాడు. అయితే.. వైజాగ్ పోలీసులు ఈ కేసును రెండు గంటల్లోనే ఛేదించారు. అందుకే నా కొడుకు, నా భార్య ఇప్పుడు ప్రాణాలతో నాకు దక్కారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు ధన్యావాదాలు అంటూ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎంపీ.
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
This website uses cookies.