YCP MP : వైసీపీ ఎంపీ భార్య కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YCP MP : వైసీపీ ఎంపీ భార్య కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ !

YCP MP : ఇవాళ ఏపీలో ఇదే ట్రెండింగ్ టాపిక్. వైసీపీకి చెందిన వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ కేసును ఛేదించారు. సినీ ఫక్కీలో ఆ నిందితులను ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను రక్షించారు. ఈ ఘటన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 June 2023,9:00 pm

YCP MP : ఇవాళ ఏపీలో ఇదే ట్రెండింగ్ టాపిక్. వైసీపీకి చెందిన వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ కేసును ఛేదించారు. సినీ ఫక్కీలో ఆ నిందితులను ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను రక్షించారు. ఈ ఘటన జరిగినప్పుడు వైజాగ్ ఎంపీ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే వైజాగ్ కు చేరుకున్నారు.

అసలు తన భార్య, కొడుకు, తన ఆడిటర్ ఈ ముగ్గురూ రెండు రోజుల కిందటే కిడ్నాప్ కు గురయ్యారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే హైదరాబాద్ నుంచే పోలీసులతో మాట్లాడుతూ.. కిడ్నాప్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. తనకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ల వివరాలు కూడా ఇచ్చాడు. ఆ వివరాల ప్రకారం.. కిడ్నాప్ ను పోలీసులు ఛేదించిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆయన వైజాగ్ కు వెళ్లారు.

Ysrcp

Ysrcp

YCP MP : నా కొడుకుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు?

తన కొడుకుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశానని.. అప్పుడే నా కొడుకు, భార్య కిడ్నాప్ కు గురయ్యారని తెలిసిందన్నారు. దాదాపు 48 గంటలు కిడ్నాపర్లు వాళ్ల ఇంట్లోనే బంధించారు. హేమంత్ అనే రౌడీ షీటర్ పనే ఇది. మరో కిడ్నాప్ కేసులోనూ హేమంత్ దోషిగా ఉన్నాడు. కేవలం డబ్బు కోసమే నా కొడుకు, భార్యను ఆ రౌడీ షీటర్ కిడ్నాప్ చేశాడు. అయితే.. వైజాగ్ పోలీసులు ఈ కేసును రెండు గంటల్లోనే ఛేదించారు. అందుకే నా కొడుకు, నా భార్య ఇప్పుడు ప్రాణాలతో నాకు దక్కారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు ధన్యావాదాలు అంటూ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎంపీ.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది