Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్

Sailajanath : దేశ రాజకీయాల్లో పెను చర్చకు కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు తాజాగా లోక్‌సభలో ఆమోదం పొందింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఘాటు స్పందన తెలిపింది.

Sailajanath ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు శైలజానాథ్

Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్

Sailajanath చంద్రబాబుకు ముస్లిమ్స్ గుణపాఠం చెపుతారా..?

వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత శైలజానాథ్ మాట్లాడుతూ.. ముస్లింల హక్కులను కాలరాస్తూ, మైనారిటీలతో ఘోరమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ముస్లిం వర్గానికి ఇచ్చిన హామీలను మరిచిపోయారని, ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఆయన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని విమర్శించారు. షర్మిలను తెరపైకి తీసుకురావడం, కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక వక్ఫ్ బిల్లును పక్కదారి పట్టించే ఉద్దేశమే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ధోరణి అని, ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ నిత్యకృత్యమని అన్నారు.

అంతేకాక వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలో ఆమె భాగమైందని శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ కుట్రల వెనుక చంద్రబాబు మాస్టర్‌మైండ్‌గా ఉన్నారని, షర్మిల కూడా అదే దిశగా కదులుతున్నారని విమర్శించారు. డబ్బు కోసం పార్టీలు పెట్టి, మూసి వేసే వాళ్లు ప్రజల పక్షాన నిలబడలేరని, ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రజలను మోసం చేయలేవని తేల్చి చెప్పారు. మొత్తంగా వక్ఫ్ బిల్లుతో మొదలైన వివాదం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించడంతో పాటు, పలు కీలక నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది