
Nara Lokesh : నారా లోకేష్ ను మెచ్చుకున్న మాజీ వైసీపీ నేత..?
Nara Lokesh : మేకపాటి కుటుంబం mekapati family వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో YSr Congress Party గుర్తింపు లేదని అసంతృప్తితో ఉందా? టిడిపిలో TDP చేరడమే శ్రేయస్కరమని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా, ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా, కుమారుడు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే తో పాటు మంత్రిగా, మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. ఇలా చెప్పుకుంటూ పోతే మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.
Nara Lokesh : నారా లోకేష్ ను మెచ్చుకున్న మాజీ వైసీపీ నేత..?
కాంగ్రెస్ పార్టీ Congress Party ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. 1985లో ఉదయగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1996, 1998 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. 2004లో నరసరావుపేట ఎంపీగా గెలిచారు. 2009లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఐదు సార్లు ఎంపీగా విజయం సాధించడం విశేషం.
రాజమోహన్ రెడ్డి Raja Mohan Reddy రాజకీయ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019లో రెండోసారి గెలిచి జగన్ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. అయితే ఆయన అకాల మరణంతో తమ్ముడు విక్రం రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, నారా లోకేష్ Nara Lokesh ను కలిశారు. రాజమోహన్ రెడ్డి ని చూసిన లోకేష్ నమస్కరిస్తూ ఆయన వద్దకు వెళ్లారు. అటు రాజమోహన్ రెడ్డి సైతం లోకేష్ ను చూసి లేచి నిలబడ్డారు. వెల్డన్ లోకేష్.. అనుకున్నది సాధించారు అంటూ అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటినుంచి మేకపాటి కుటుంబం టీడీపీలో చేరుతుందనే ప్రచారం నడుస్తుంది. అయితే మేకపాటి కుటుంబానికి అటువంటి ఆలోచన లేదని అనుచరులు చెబుతున్నారు.
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
This website uses cookies.