YS Jagan : ఈ మంత్రులకి సీటు ఇవ్వకూడదు అని జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారా?
YS Jagan : ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో నో డౌట్. ప్రస్తుతం వైసీపీకి 150కి పైనే ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ కన్ఫమ్ అయినట్టేనా? అందరికీ టికెట్లు ఇస్తే అందరూ మళ్లీ గెలుస్తారా? వైసీపీ ఎమ్మెల్యేల్లో మంత్రులు కూడా ఉన్నారు. మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. వాళ్లంతా సీఎం జగన్ కు ఆత్మీయులే. వాళ్లంతా సీఎం జగన్ కు కావాల్సిన వాళ్లే కావడంతో అందరికీ టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ.. బయట పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. కొందరు మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
అసలు కొందరు మంత్రులను అయితే ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మంత్రులు గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. నిజానికి.. ఎమ్మెల్యేలు అంతా ఆ పనిలో ఉన్నారు. కానీ.. మంత్రులకు మాత్రం ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. ఇటీవల డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ స్వామి తన సొంత నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ప్రజలు తమ ఇంటి తలుపులకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి కూడా అలాగే తయారైంది. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. చివరకు ఆయన ఇంటి ముందే ప్రజలు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి ఆయనకు ఓటమి తప్పదని సొంత పార్టీ నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
YS Jagan : మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి కూడా అలాగే ఉంది
ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా అంతే. అసలు తన నియోజకవర్గంలో ధర్మానకు మద్దతే లభించడం లేదు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అంటారు. మహిళా మంత్రి ఉష పరిస్థితి కూడా అంతే అట. ఇలా.. చాలామంది మంత్రులు ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వాళ్లకు టికెట్లు ఇస్తారా? ఇస్తే వాళ్లు మళ్లీ గెలుస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.