YCP : ఏపీలో పెరుగుతున్న వైసీపీ గ్రాఫ్.. కూటమి అలర్ట్ కావాల్సిందేనా..?
ప్రధానాంశాలు:
ఆ జిల్లాలో భారీగా పెరిగిన వైసీపీ గ్రాఫ్..కూటమికి ఇక కష్టాలు తప్పవా..?
YCP : ఏపీలో పెరుగుతున్న వైసీపీ గ్రాఫ్.. కూటమి అలర్ట్ కావాల్సిందేనా..?
YCP : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు వైసీపీ పార్టీకి అనుకూలంగా మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంతకాలం సైలెంట్ గా ఉన్న శ్రేణులు, మళ్లీ ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేకించి నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నిర్వహించిన సమావేశానికి భారీగా కార్యకర్తలు హాజరవడం పార్టీ పునరుజ్జీవనానికి సంకేతంగా మారింది. పుంగనూరుకు తర్వాత అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరైన నియోజకవర్గ సమావేశంగా శ్రీకాళహస్తి రికార్డులకెక్కింది.

YCP : ఏపీలో పెరుగుతున్న వైసీపీ గ్రాఫ్.. కూటమి అలర్ట్ కావాల్సిందేనా..?
YCP ఏపీలో వైసీపీ పుంజుకుంటుందా..? దీనికి ఇదే సాక్ష్యం
ఈ సమావేశానికి తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బియ్యష మధుసూదనరెడ్డి, ఎమ్మెల్సీ సిసాయి సుబ్రమణ్యం తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 500 మందికిపైగా కార్యకర్తలు పాల్గొనడం, పార్టీ పట్ల నమ్మకాన్ని చూపించడం విశేషంగా మారింది. ఎన్నికల తర్వాత వైసీపీ అక్కడ కార్యకలాపాలు తగ్గిపోయినప్పటికీ, తాజా సమావేశం ద్వారా పార్టీకి పునరుత్సాహం లభించినట్లు తెలుస్తోంది. సమన్వయకర్త మధుసూదనరెడ్డి తిరిగి యాక్టీవ్ కావడం కూడా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇక రాయుడు హత్య కేసు నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో వైసీపీ నేత మధుసూదనరెడ్డి ప్రజల్లో ‘నాయకుడిగా’ కనిపిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బొజ్జలపై టీడీపీ, జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోవడం, నియోజకవర్గంలో ఆయన దూకుడు తగ్గిపోవడం కూడా వైసీపీకి బలంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ గ్రాఫ్ క్రమంగా పైకి వెళ్లడం, భవిష్యత్తులో శ్రీకాళహస్తిలో రాజకీయ సమీకరణాలు మారిపోవచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి.