YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి Ysrcp వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలే ఒక్కొక్కరే చేజారిపోతున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామా చేసి అధికార కూటమీ ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా Vijayasai Reddyవిజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. మరికొందరు కూడా ఇదే బాటలో కొనసాగనున్నట్లు అంతటా చర్చించుకుంటున్నారు. అధిష్ఠానం రంగంలోకి దిగి దిద్దుబాటు, బుజ్జగింపు చర్యలు చేపట్టకపోతే ఇక ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేది కష్టమే అంటున్నారు.ప్రజలు ప్రతిపక్ష పాత్ర కట్టబెట్టినప్పుడు పార్టీ ప్రజల మధ్యన ఉంటూ వారి కోసం కోసం పనిచేస్తూ ప్రజల వాణిని బలంగా వినిపించాలి. అందుకు పార్టీ పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఒక్కతాటిపై నిలువాల్సి ఉంటుంది. అధినాయకుడి నుంచి దిగువ స్థాయి కేడర్ వరకూ అందరూ సమిష్టిగా కష్టించాల్సి ఉంటుంది.
ప్రాంతీయ పార్టీలలో అధినేత చుట్టే రాజకీయాలు తిరుగుతాయి. TDP టీడీపీలో Chandrababu చంద్రబాబు, జనసేనలో Pawan Kalyan పవన్ కళ్యాణ్ పార్టీని నిరంతరం నడిపిస్తారు. అదే వైసీపీలో ఆ రకమైన పార్టీ స్ట్రక్చర్ లేదనే విమర్శలు ఉన్నాయి. జగన్ కి ఉన్న జనాదరణ మళ్లీ పార్టీని గెలుపిస్తుందని నమ్ముతారే గానీ క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందిస్తూ పార్టీ పటిష్టతకు పని చేయరని అంటున్నారు. ఈ పర్యవసానాలే వరసబెట్టి నేతలు రాజీనామాల బాట పట్టడానికి కారణంగా మాట్లాడుకుంటున్నారు. ఇక పార్టీలో ఉన్న వారు సైతం నైరాశ్యంలో మునుగుతున్నారు.
పార్టీని ఎవరు వీడినా పర్వాలేదన్న ధోరణి మంచిది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. నెంబర్ గేమ్‌లో ఒక్క సీటు కూడా ప్రధానమే కాబట్టి ప్రతీ ఒక్కరూ కీలకమే. ఏ ఒక్క నేత పార్టీని వీడినా నష్టం ఉంటుందనే అంటున్నారు. ఇకనైనా పార్టీ కేడర్‌లో, నాయకుల్లో విశ్వాసం పెంపొందేలా అధినాయకత్వం చర్యలు చేపట్టకపోతే వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమే అంటున్నారు.
Ashtalakshmi yoga : ఫిబ్రవరి మాసంలో రాశులు అష్టలక్ష్మి యోగంతో మిధున రాశిలోకి ఈ రాశుల వారు అపర కుబేర్లు కాబోతున్నారు.…
kiwi Fruit : ఈ పండు తినటానికి చాలా రుచిగా, పుల్లగా ఉంటుంది. ఈ పండు పేరు కివి ఫ్రూట్.…
SCR Jobs : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) 2024-25 సెషన్ కోసం అప్రెంటిస్ చట్టం, 1961 కింద 4232…
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారంకు ప్రాముఖ్యత అయితే ఉందో, గ్రహాల యొక్క వక్రగతికి కూడా…
Peerzadiguda : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని 76th Republic Day ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
Telangana : ఘటకేసర్ మండలం గణపురం గ్రామంలో రైతు భరోసా rythu bharosa , ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,ఇందిరమ్మ…
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా…
Samantha : నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న సమంత కొన్నాళ్లు హెల్త్ ఇష్యూస్ వల్ల సినిమాలకు దూరంగా ఉంది.…
This website uses cookies.