Peddireddy Ramachandra Reddy : విత్ ప్రూఫ్స్ CID కి దొరికిన పెద్దిరెడ్డి .. పండగ రోజే అరస్ట్ ?
ప్రధానాంశాలు:
Peddireddy Ramachandra Reddy : విత్ ప్రూఫ్స్ CID కి దొరికిన పెద్దిరెడ్డి .. పండగ రోజే అరస్ట్ ?
Peddireddy Ramachandra Reddy : మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం చేసిన కేసులో ఎట్టకేలకు ఒక పెద్ద బ్రేక్ తగిలింది. ఈ కేసులో చాలా కాలంగా పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరులు మునితుకారం మరియు మాధవరెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తుండగా ఒక టోల్ ప్లాజా దగ్గర కాఫీ తాగుతూ దొరికిపోయారు. సిఐడి అధికారులు పక్కా సమాచారంతో మాటు వేసి మరీ వీరిని అదుపులోకి తీసుకోవడం విశేషం. గతంలో వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వైసీపీ నాయకులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం అధికారులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు.
Peddireddy Ramachandra Reddy : విత్ ప్రూఫ్స్ CID కి దొరికిన పెద్దిరెడ్డి .. పండగ రోజే అరస్ట్ ?
నిజానికి ఈ కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరూ గతంలో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మాధవరెడ్డిని ఒకసారి కోర్టు ముందు ప్రవేశపెడితే రిమాండ్ రిపోర్టులో సాంకేతిక లోపాలు ఉన్నాయనే కారణంతో ఆయనకు బెయిల్ లభించింది. ఇక మునితుకారం అయితే ఏకంగా విదేశాలకు కూడా పారిపోయి వచ్చారు. వీరిద్దరూ సుప్రీం కోర్టు వరకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా అక్కడ కూడా చుక్కెదురైంది. సిఐడి ముందే లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా వీరు మాత్రం అజ్ఞాతంలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు వీరు దొరికిపోవడంతో పెద్దిరెడ్డికి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Peddireddy Ramachandra Reddy :పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై అరెస్టుల ప్రభావం
మదనపల్లి ఫైల్స్ దహనం కేసు వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో సిఐడి విచారణ సాగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు అలాగే ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికే ఈ ఫైల్స్ తగలబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పట్టుబడిన అనుచరులు నోరు విప్పితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలన్నీ బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో వచ్చిన డబ్బు పెద్దిరెడ్డి కంపెనీల్లోకి మళ్లినట్లు కూడా సిఐడి అనుమానిస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టైం దగ్గర పడినట్లే కనిపిస్తోంది. సొంత పార్టీలోనే ఆయనను ఇష్టపడని కొందరు నాయకులు ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. ఏ క్షణమైనా పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఆయన కుమారుడు జైలులో ఉన్నప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేశారని గొడవ చేసిన పెద్దిరెడ్డి ఇప్పుడు తనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనని జిల్లా అంతా చర్చించుకుంటున్నారు. ఈ అరెస్టులతో మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో మరిన్ని నిజాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.