YCP : హరి హర వీరమల్లు పై ఎవ్వరు మాట్లాడోద్దు.. వైసీపీ ఆదేశాలిచ్చిందా..?
ప్రధానాంశాలు:
హరి హర వీరమల్లు పై ఎవ్వరు మాట్లాడోద్దు.. వైసీపీ ఆదేశాలిచ్చిందా..?
పవన్ కళ్యాణ్ కు జగన్ భయపడ్డడా..? అందుకే సొంత పార్టీ నేతలకు ఆ ఆదేశాలు ఇచ్చాడా..?
వీరమల్లు కు భయపడిన జగన్..పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు
YCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన Ys Jagan అధినేత, డిప్యూటీ సీఎం Pawan Kalyan పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తీసుకుంటున్న వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో పవన్ ను విమర్శిస్తూ వచ్చిన పలువురు వైసీపీ నేతలకు, తాజాగా ఆయన్ను టార్గెట్ చేయొద్దని ఆ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ముఖ్యంగా ఆయనపై తిరగబడి మాట్లాడడం వల్ల గత ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయామని వైఎస్ జగన్ గుర్తించి, ఇకపై అలాంటి పొరపాట్లు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట.

YCP : హరి హర వీరమల్లు పై ఎవ్వరు మాట్లాడోద్దు.. వైసీపీ ఆదేశాలిచ్చిందా..?
YCP వీరమల్లు సినిమా విషయంలో ఎవ్వరు నెగిటివ్ ప్రచారం చేయొద్దు.. సొంత పార్టీ నేతలకు జగన్ ఆదేశం
పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని గతంలో చేసిన విమర్శలు కాపు, బలిజ సామాజిక వర్గాల్లో వైసీపీకి నష్టంగా మారాయని, ఈ విషయాన్ని ఆ వర్గానికి చెందిన నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వారు చెప్పిన మాటలతో జగన్ కూడా పూర్తిగా ఏకీభవించి, ఇకపై పవన్ విషయాల్లో నెగెటివ్ వ్యాఖ్యలు చేయవద్దని కీలక నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ నేపధ్యంలో రోజా వంటి కొందరు మినహాయిస్తే, మిగిలిన నేతలంతా పవన్ సినిమాపై మౌనంగా ఉండడాన్ని ఈ మారిన వైఖరికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలైంది. సినిమా ప్రమోషన్ సందర్భంగా పవన్ కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేసినా, వైసీపీ నాయకులు అధికారికంగా ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో మాత్రం కొంత వ్యతిరేకత కనిపించినా, పార్టీ అధికార ప్రతినిధులు, ప్రముఖ నేతలు మాత్రం అంతకు దూరంగా ఉన్నారు. ఇది జగన్ స్వయంగా ఇచ్చిన దిశానిర్దేశాన్నే సూచిస్తుంది.
అందులోనూ మాజీ మంత్రి అంబటి రాంబాబు హరిహర వీరమల్లు సినిమా గురించి పాజిటివ్ గా స్పందించడం విశేషం. సినిమా ఫలితంపై భిన్న అభిప్రాయాలు రావడం బాధగా ఉందని చెప్పిన ఆయన ట్వీట్ వైసీపీ మారిన దృక్కోణానికి ఉదాహరణ. మొత్తంగా చూస్తే పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఎదుర్కొనడంలో తడవతో కూడిన వ్యూహం కన్నా, సున్నితమైన, సమతుల్య దృక్కోణం వైసీపీకి బాగుంటుందన్న సంకేతాలే ఈ పరిణామాల వెనుక ఉన్నట్టు అనిపిస్తోంది.