Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?
ప్రధానాంశాలు:
Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన ‘ఏకాకి’ పోరాటాన్ని పక్కనపెట్టి, కొత్త మిత్రుల కోసం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Ys Jagan వామపక్షాలతో జగన్ దోస్తీ.. ఆ దిశగానే వైసీపీ అడుగులు !
ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో గత పదిహేనేళ్లుగా ‘సింగిల్’గానే పోటీ చేస్తూ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, Ysrcp ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాబోయే 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని గట్టిగా ప్రకటిస్తుండటంతో వైసీపీ పునరాలోచనలో పడింది. కూటమిని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, ప్రజా పోరాటాల అనుభవం ఉన్న వామపక్ష పార్టీలను (CPI, CPM) కలుపుకుని వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో 2014-19 మధ్య కూటమి విడిపోయినట్లు ఇప్పుడు జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుందని వైసీపీ సీనియర్ నేతలు కూడా విశ్లేషిస్తున్నారు.
Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?
Ys Jagan విశాఖ భూపోరాటమే తొలి అడుగు
వైసీపీ మరియు వామపక్షాల CPI మధ్య ఈ కొత్త బంధానికి విశాఖపట్నం వేదిక కాబోతోంది. విశాఖలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని వెళ్తామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బహిరంగంగానే ప్రకటించారు. తమ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే వామపక్ష నాయకులతో మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యల కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం భూ దందాల మీదనే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది.
Ys Jagan 2029 ఎన్నికల వ్యూహం: కూటమి వర్సెస్ కూటమి?
కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా, ఈ బంధం 2029 ఎన్నికల నాటికి ఒక బలమైన వైసీపీ కూటమిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వామపక్షాలకు రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల అండ ఉండటం వైసీపీకి పెద్ద ప్లస్ కానుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో కమ్యూనిస్టుల పోరాట పటిమ జగన్‌కు అవసరమని పార్టీ భావిస్తోంది. టీడీపీ కూటమి పటిష్టంగా ఉన్న వేళ, మేధావులు, ప్రజా సంఘాలు మరియు వామపక్షాలతో కలిసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే జగన్ ముందున్న లక్ష్యం. విశాఖలో మొదలవుతున్న ఈ దోస్తీ రాష్ట్రవ్యాప్తమైతే, ఏపీలో రాబోయే రోజుల్లో ‘కూటమి వర్సెస్ కూటమి’ పోరు తప్పకపోవచ్చు.