Ys Jagan : బెదిరింపులు కక్షసాధింపులకు తగ్గేదేలే అంటున్న వైఎస్ జగన్..!
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వ ఓ పక్క పాలనా విధివిధానాలను సరిచేస్తూ ప్రతికార చర్యలను కూడా మొదలు పెట్టింది. వైసీపీ అధికారం లో ఉన్న టైం లో టీడీపీ ప్రజావేదికను కూల్చేశారు. అప్పటి వైసీపీ దుశ్చర్యకు రిటర్న్ గిఫ్ట్ గా నేడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం వైసీపీ కార్యలయం కోసం నిర్మిస్తున్న బిల్డింగ్ ని ధ్వంసం చేశారు. తమ పార్టీ కార్యాలయానికి ఏర్పరుస్తున్న భవనాన్ని కూల్చడంపై వైసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు కక్ష సాధింపులకు వైసీపీ పార్టీ తలొగ్గదని రాసుకొచ్చారు.
బిల్డింగ్ ఎందుకు కూల్చేశారు అంటే.. తాడేపల్లిలో ఏదైతే వైసీపీ కార్యాలయం నిర్మించాలని అనుకున్నారో అది బోటు యార్డుగా వినియోగించారు. ఐతే ఆ బోటు యార్డుని తీసేసి ఆ స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయానికి అప్పటి జగన్ ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఐతే హైకోర్టులో ఉన్న ఈ కేసు కొలిక్కి రాకుండానే ఈ కూల్చివేత చేయడం జరిగింది. దీనిపై వైసీపీ అధికారులు టీడీపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయట్లేదని.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అంటున్నారు. అంతేకాదు కనీసం ఎలాంటి నోటీసులు లేకుండా ఈ కూల్చివేత జరిగిందని అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో పోరాడుతామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతుంది.
నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతపై వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లి కార్యలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. రాష్ట్రం లో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ సంఘటనతో ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, కక్షసాధింపు చర్చ్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదని ఎక్స్ లో రాసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.