
YS Jagan : అభ్యర్థులను ప్రకటిస్తున్న జగన్.. జనంలోకి వచ్చేది ఎప్పుడు..?
YS Jagan : ముందుగా వైసిపి అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాతే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నాలుగో జాబితాను కూడా విడుదల చేసేందుకు వైసిపి పార్టీ సిద్ధమైంది. అయితే ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసిపి పార్టీ 59 స్థానాలలో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దీని కారణంగా ముందుగానే మార్పు చేర్పులు చేపడితే అసంతృప్తులు సర్దుకుంటారనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈనెల 25 నుంచి జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వైసిపి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాని కంటే ముందుగా కేడర్ తో సమీకరించడానికి సమాయత్తం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మొట్టమొదట ఉత్తరాంధ్రలో జగన్ పర్యటించనున్నారు.భీమిలిలో కార్యక్రమాలు నిర్వహించి సమావేశాలు జరిపి వైసీపీ శ్రేణులకు ముందుగా దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలో అనే విషయాలపై ఆయన చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం చూసినట్లయితే జగన్ ఒక్కడే ఒకవైపు మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలంటే వైసిపి పార్టీ శ్రేణులు మరియు కేడర్ క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గత నాలుగున్నర ఏళ్లవైసిపి పాలన కేడర్ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసినట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా కేడర్ లోని అసంతృప్తులను పోగొట్టి వారిలో ఉత్సాహం నింపాలసి ఉంది. కాబట్టి జగన్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.అది చేసినప్పుడే ప్రత్యర్థులతో డీ అంటే డీ అని అధికార పార్టీ పోటీ పడగలుగుతుంది. ఇక వైసిపి శ్రేణుల అసంతృప్తిని గమనించిన జగన్ ముందుగా వారితో సమావేశాలు నిర్వహించి అనంతరం కోస్తా రాయలసీమ క్యాడర్ తో కూడా సమావేశాలు జరుపుతారు అని తెలుస్తోంది.ఆ తరువాత జనంలోకి జగన్ వెళ్ళనున్నట్లు సమాచారం.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.