Jai Hanuman 2025 Movie : జై హనుమాన్ 2025 సినిమాలో జరగబోయేది ఇదే...!
Jai Hanuman 2025 Movie : ప్రస్తుతం ‘ హనుమాన్ ‘ సినిమా థియేటర్ల వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జై హనుమాన్ 2025 లో ఏం జరగబోతుంది అనేదానిపై సినిమా చూసిన వాళ్ళలో ఆసక్తి నెలకొంది. హనుమాన్ సినిమాలో మణి విచ్చిన్నం తర్వాత అసలు ప్రచండ యుద్ధం మొదలైందని, ఎవరైతే భూమిని నాశనం చేయాలనుకుంటారో వాళ్ల ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఇక విభీషణుడిగా నటించిన సముద్రఖని నీ రాక అనివార్యం హనుమ అని అంటారు. వెంటనే హిమాలయాల్లో ఉన్న హనుమ ఇది విని అంజనాద్రికి వస్తాడు.
అయితే క్లైమాక్స్లో రాముడికి హనుమాన్ మాట ఇస్తాడు. హనుమాన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అని విభీషణుడు అంటారు. అసలు రాముడికి ఇచ్చిన మాట ఏమై ఉంటుందంటే సప్త చిరంజీవులు భూమి మీద కాలమాన పరిస్థితుల ద్వారా ఉండిపోతారు. విభీషణుడు, హనుమంతుడు, అశ్వద్ధామ, వ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మహాబలి వీళ్లంతా ఉండిపోతారు. అయితే హనుమంతుడు రాముడికి మాట ఇచ్చాడని, భూమికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, యుగం ముగిసిన తర్వాత కూడా తను భూమి మీదే ఉంటానని మాట ఇచ్చాడు. కలియుగం అంతం అయ్యే టైంలో జరిగే పరిణామాలను ఆ తీవ్రతను ప్రజలను కాపాడడం కోసం హనుమంతుడు మాట ఇస్తాడు. రాబోతున్న యుద్దానికి హనుమంతుడు ఎలా సిద్ధమవుతాడు.
అయితే హనుమంతుడు శక్తులు ఇచ్చిన హనుమంతుతో ఉంటాడా లేక ఒక్కడిగానే చేస్తాడా అనేది జై హనుమాన్ లో ఉండబోతుంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో డ్రాగన్స్ కి హనుమాన్ కి పెద్ద యుద్ధాలు జరిగే అవకాశం ఉందిష. దుష్ట శక్తులు భూమిని అంతం చేయబోతున్న టైం లో తేజ సజ్జా తో పాటు తాను కూడా అందరిని అంతమొందిస్తాడని, ఇదే జై హనుమాన్ లో జరగబోయేది అని అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా 2025లో సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇది కూడా అందరిని అలరిస్తుందని ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ గా ఉన్నారు. దాదాపుగా 12 మంది సూపర్ హీరోలను క్రియేట్ చేయబోతున్నారు. డ్రాగన్ రూపంలో ఉన్న దుష్టశక్తులను సంహరించడానికి హనుమంతుడు అంజనాద్రి ప్రజలతో కలిసి పోరాడుతాడని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.