Ys Jagan : మ‌హిళ‌ల‌కి శుభవార్త చెప్పిన వైఎస్‌ జ‌గ‌న్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : మ‌హిళ‌ల‌కి శుభవార్త చెప్పిన వైఎస్‌ జ‌గ‌న్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :18 March 2024,7:00 pm

Ys Jagan : ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. తాజాగా మ‌హిళా ఉద్యోగుల‌కి శుభ‌వార్త అందించాడు. పిల్లల సంరక్షణ సెలవులు (చైల్డ్ కేర్ లీవ్స్)కు సంబంధించి గ‌తంలో ప్ర‌భుత్వం విధించిన గడువును తొల‌గిస్తూ ఇప్పుడు కొత్త‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అప్ప‌ట్లో తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేలోగా మహిళా ఉద్యోగులు ఈ సెలవులను వాడుకోవాల్సి ఉంటుంద‌ని జీవో జారీ చేశారు.కాని ఇప్పుడు దానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొల‌గించింది. రిటైర్ అయ్యేలోపు ఈ మ‌హిళా ఉద్యోగ‌లు 180 రోజుల సెల‌వుల‌ని ఎప్పుడైన వాడుకోవ‌చ్చు అని తెలియ‌జేశారు. దీంతో మ‌హిళా ఉద్యోగుల ఆనందం అవ‌ధులు దాటింది.

గత ఎన్నికల్లో భాగంగా వైఎస్‌ జ‌గ‌న్ ప‌లు వాగ్ధానాలు చేయడం మ‌నం చూశాం. వాటిని ఈ ఐదేళ్ల‌లో ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నాడు. ఉద్యోగుల‌కి సంబంధించి చూస్తే వారు చేసిన డిమాండ్స్ స‌రైన‌వి అనిపిస్తే వెంట‌నే నెర‌వేరుస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అంగన్ వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేయడంతో వారి జీతాల్లో కోత విధించారు. అయితే త‌ర్వాత ఆ కాలాన్ని విధి నిర్వహణలోనే ఉన్నట్లు లెక్కించి..వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు.. అలాగే మున్పిపల్ కార్మికుల విషయంలో కూడా జ‌గ‌న్ ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకొని వారిచేత శ‌భాష్ అనిపించుకున్నారు.

ఇక వీటితో పాటే అమరావతి రాజధాని పరిధిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ వైఎస్‌ జ‌గన్ ప్ర‌భుత్వం ఓ కీల‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామ పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నట్లుగా జీవో జారీ చేస్తూ ఈ విష‌యాన్ని తెలియజేశారు. 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు అమరావతిలోనే స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని రూల్స్ ప్రకారమే.. ఇప్పుడు కూడా స్థలాల ధర, విస్తీర్ణం ఉంటాయని అందులో తెలియ‌జేశారు . ఇక వీటితో పాటు ఉద్యోగులు, పింఛన్ దారులకు డీఏల మంజూరు, మున్సిపల్ కార్మికులపై సమ్మెకాలంలో నమోదైన కేసులను ఎత్తివేయడం, అంగన్ వాడీ కార్యకర్తలకు సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం వంటి నిర్ణయాలు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది