Ys Jagan : ఏపీ సచివాలయ ఉద్యోగులకి జగన్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ గుడ్ న్యూస్ లు !
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాలనపరంగా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకే అందేలా సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో సచివాలయ వ్యవస్థను చాలా అద్భుతంగా వాడుకుంటూ ప్రజలకు సేవలు అందించే విషయంలో… ప్రధాన పాత్ర పోషించేలా వ్యూహాత్మకంగా రాణిస్తున్నారు.
దీంతో ఇప్పటికే ప్రభుత్వంలో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో కీలకంగా ఉన్న ఉద్యోగులకు కావలసిన అన్ని సదుపాయాలు సీఎం జగన్ వారికి ఇటీవల కల్పించడం జరిగింది. కాగా తాజాగా ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్లేందుకు సైతం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఫైలు పై సంతకం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఫైల్ పై సీఎం జగన్ ఆమోదం తెలిపినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకు జూన్ 10 వరకు బదిలీలకు అవకాశం కల్పించారు.
దీంతో బదిలీలు కావలసిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వారికి విధివిధానాలు కూడా ప్రకటించింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు. ఈ రకంగా సచివాలయ ఉద్యోగులకు కొద్ది నెలల క్రితం జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందించడం జరిగింది.