Ys Jagan : అలాంటి హామీలు ఇవ్వలేకే సీఎం కాలేకపోయానంటున్న జగన్.. అయ్యాడుగా మళ్లీ ట్రోల్ స్ట్రాట్..!
ప్రధానాంశాలు:
Ys Jagan : అలాంటి హామీలు ఇవ్వలేకే సీఎం కాలేకపోయానంటున్న జగన్.. అయ్యాడుగా మళ్లీ ట్రోల్ స్ట్రాట్..!
Ys Jagan : అజ్ఞానం ఆనందం కానీ ఎల్లప్పుడూ కాదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కాదు. వారికి, అజ్ఞానం అహంకారంగా రావచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో, పార్టీ నాయకులతో జరిపే సమావేశాల్లోనూ మాట్లాడినప్పుడల్లా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. రాజకీయాల్లో ఉన్నపుడు నాయకులు ఎక్కడో ఒకప్పుడు పప్పులో కాలు వేయడం సహజమే. అయితే వాటిని వారు కన్వీనియెంట్ గా మరచిపోయినా తవ్వి తీయడానికి ప్రత్యర్ధి పక్షాలు ఎల్లప్పుడు రెడీగానే ఉంటాయి. వైఎస్ జగన్ పబ్లిక్ మీటింగులోనూ, పార్టీ మీటింగుల్లోనూ కూడా విలువలు, విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడుతూంటారు. తాను చెప్పిందే చేస్తానని, చేయలేనిది చెప్పనని అంటుంటారు. అధికారం కోసం అబద్ధాలు ఆడడం, నెరవేర్చలేని హామీలు ఇవ్వడం తనకు చేత కాదని చెబుతుంటారు.
తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను అబద్ధాలు, తప్పుడు హామీలు ఇవ్వలేదు కాబట్టే ఓడాను అన్నారు. అయినా గెలుపొటములు రాజకీయాల్లో సహజమని అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కలేనని, విలువలు విశ్వసనీయత ఎప్పటికైనా ముఖ్యమని ఆయన అన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలు ప్రశ్నిస్తారని, అలా చీదరింపులకు గురికాకుండా ప్రతిపక్షంలో ఉండడమే మేలు అన్నారు. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. జగన్ అబద్ధాలు ఆడలేదా ఎన్ని ఉదాహరణలు కావాల్నో చెప్పండని ప్రశ్నిస్తున్నారు. ఆయన 2019లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని కానీ గతం కంటే ఎక్కువ మద్యం తన పాలనలో అమ్మి ఆదాయం గడించారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.

Ys Jagan : అలాంటి హామీలు ఇవ్వలేకే సీఎం కాలేకపోయానంటున్న జగన్.. అయ్యాడుగా మళ్లీ ట్రోల్ స్ట్రాట్..!
అది తప్పుడు హామీ కాదా అని నిలదీస్తున్నారు. అలాగే నాయకులతో కలిసి ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా జగన్ బుడమేరు కాల్వ గురించి రెండు ప్రకటనలు చేశాడు. ఇది తనను ట్రోల్ చేయడానికి సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులకు పుష్కలంగా మెటీరియల్ అందించింది. కేవలం అవి మాత్రమే కాదని 2019 ఎన్నికల వేళ జగన్ అనేక హామీలు ఇచ్చారని వాటిని అధికారంలోకి రాగానే మరచిపోయారని విమర్శిస్తున్నారు. మొత్తం మీద జగన్ ఇచ్చిన ఈ ఎమోషనల్ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో కూటమి నేతలకు ఒక ఆయుధంగా మారింది. జగన్ తన చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఇచ్చిన స్టేట్‌మెంట్ అయినప్పటికీ ఇది ఆయన తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు వేసిన ఎత్తుగడగా కూటమి నేతలు విమర్శిస్తున్నారు.