Ys Jagan : ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం జగన్ ఈ సారి ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అయితే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సారి జగన్ ఎన్నికలలో గెలవాలి అంటే అందరి మద్దతు తప్పక అవసరం ఉందటుంది. ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్ కి చిరకాలంగా రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంటూ వచ్చింది. విభజన తరువాత కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా పదేళ్ల తరువాత తిరిగి తెలంగాణాలో అధికారాన్ని చేపట్టింది. అయితే జగన్ 2011లో పార్టీ పెట్టినప్పుడు ఆయనకి రెడ్డి వర్గం చాలా మద్దతు ఇచ్చింది. అలా మద్ధతు ఉండడంతో వైసీపీ అద్భుతాలు చేసింది.
అయితే 2019 నుంచి 2024 మధ్య సాగిన వైసీపీ అయిదేళ్ల పాలనలో రెడ్లు చాలా ఇబ్బంది పడ్డారు అని ఒక టాక్ నడుస్తుంది. వైసీపీ రూపొందించిన కొన్ని పాలసీల వల్ల రెడ్లు ఆర్ధికంగా దెబ్బతిన్నారు అన అంటున్నారు. సోషల్ ఇంజనీరింగ్ పుణ్యమాని రాజకీయంగా రెడ్లు పూర్తిగా నష్టపోయారు అని అంటున్నారు. అయితే రెడ్ల ఎఫెక్ట్‌తో జగన్‌కి బాగా దెబ్బ పడిందని ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. టీడీపీకి ఒక బలమైన సామాజిక వర్గం వెంట ఉండి పూర్తిగా సహకరించడం వల్లనే అధికారం దక్కింది అని కూడా చెబుతున్నారు. ఈ మొత్తం అన్ని అంశాలను పూర్తిగా సమీక్షించుకున్న మీదటనే వైసీపీ హై కమాండ్ వచ్చే ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తుంది.
వైసీపీకి అండగా నిలిచిన బలమైన రెడ్డి సామాజిక వర్గం అండను ఇప్పుడు వైసీపీ కోరుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. వైసీపీకి హార్డ్ కోర్ లాంటి రాయలసీమ జిల్లాలు అలాగే రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేశాయి. దాంతో రెడ్లను తమ వైపు తెచ్చుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. మరి వైసీపీ దగ్గరకు తీస్తామంటే రెడ్లు కూడా ఆలోచిస్తారు కదా. తమ ప్రయోజనాలకు ఏ మేరకు వైసీపీ కాపాడుతుందో ఆ పార్టీ అజెండా ఏమిటి ఏ విధంగా గుర్తింపు ఇస్తుంది అన్నది బేరీజు వేసుకొని మళ్లీ వారిని తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగైన కూడా అన్ని శక్తులు కూడదీసుకొని వైసీపీ గెలవాలని అనుకుంటుంది. టీడీపీ మీద వ్యతిరేకత వస్తే ఈ సారి మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అని అంటున్నారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.