Ys Jagan : బ్రేకింగ్.. చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ సంచలన సవాల్..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రూప్-1 పరీక్షలు, డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తోన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేస్తూ, గ్రూప్-1 వివాదంతో పాటు డీఎస్సీపై కూడా ఒకేసారి సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడానికి తాను సిద్ధమని, కూటమి ప్రభుత్వం కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్, కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. గత నాలుగు రోజులుగా డీఎస్సీపై చర్చకు రమ్మంటూ మంత్రి నారా లోకేశ్ విసురుతున్న సవాళ్లకు ఆయన వ్యూహాత్మకంగా బదులిచ్చారు. అసెంబ్లీ కౌన్సిల్‌లో తమ పార్టీ ఎమ్మెల్సీలు చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పారిపోతోందని, ఫీల్డర్లు లేకుండానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఏకపక్షంగా బ్యాటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Ys Jagan : బ్రేకింగ్.. చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ సంచలన సవాల్..!
Ys Jagan గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబే.. సిట్ నివేదికలోనూ క్లీన్‌చిట్!
గ్రూప్-1 పరీక్షల పూర్వాపరాలను మీడియా ముందు ఉంచుతూ వైఎస్ జగన్ వాస్తవాలను వివరించారు. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది, ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనని గుర్తుచేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రిలిమ్స్ పూర్తయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక కేవలం మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు మాత్రమే పారదర్శకంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 వాల్యుయేషన్‌పై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సైతం ఎలాంటి అవకతవకలు జరగలేదని, మూల్యాంకనం పక్కాగా జరిగిందని నివేదిక ఇచ్చిందని జగన్ గుర్తుచేశారు. అయినా కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తోందని మండిపడ్డారు.
Ys Jagan డీఎస్సీ వర్సెస్ గ్రూప్-1: రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
చంద్రబాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ (APPSC) పరీక్షల ఫలితాలు, రాత పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల వివరాలను ప్రభుత్వం ధైర్యంగా బయటపెట్టగలదా అని జగన్ ప్రశ్నించారు. తమ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గుర్తుచేశారు.”మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను సంసిద్ధం.. మరి కూటమి హయాంలో జరిగిన డీఎస్సీ 2025 అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా?” అంటూ చంద్రబాబు, లోకేశ్‌లకు జగన్ నేరుగా చాలెంజ్ విసిరారు.
రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం, డీఎస్సీ అంశంపై మంత్రి లోకేశ్ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. గ్రూప్-1 అంశాన్ని సీబీఐకి ముడిపెట్టి జగన్ వేసిన ఎత్తుగడ అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టింది. గ్రూప్-1 వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో ఉండగా, సీబీఐ దర్యాప్తు సవాల్ ద్వారా ప్రభుత్వం చేసే ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు, డీఎస్సీలో అవకతవకల అంశాన్ని ప్రజల్లో బలంగా ఉంచేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు స్పష్టమవుతోంది.
