YS Jagan : జగన్ మార్క్ రాజకీయం స్టార్ట్.. టీడీపీకి చుక్కలే ఇక.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : జగన్ మార్క్ రాజకీయం స్టార్ట్.. టీడీపీకి చుక్కలే ఇక.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్

 Authored By kranthi | The Telugu News | Updated on :13 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలలే సమయం

  •  మంత్రుల నియోజకవర్గ బాధ్యతలు మార్పు

  •  ఆ 11 నియోజకవర్గాల్లో ఇన్ చార్జీల మార్పు

YS Jagan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ఏపీలో ఎన్నికలు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అన్ని రాష్ట్రాల ఎన్నికలు వేరు. ఏపీ ఎన్నికలు వేరు. ఏపీలో ఎన్నికలు అంటే మామూలుగా ఉండవు. రచ్చ రచ్చే ఉంటుంది. రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలే ఎక్కువగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. తెలంగాణ ఎన్నికలు ఎంత చప్పగా ఉంటాయో.. ఏపీ ఎన్నికలు అంత రంజుగా ఉంటాయి. అయితే.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఏపీలోని 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జులను నియమించారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ముందుకెళ్తోంది. అయితే.. 11 నియోజకవర్గాలకు మాత్రం పార్టీ ఇన్ చార్జిలను ఎందుకు మార్చింది అనేదే ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.

మంగళగిరిలోనూ ఇన్ చార్జీని మార్చారు. ఈ విషయం ముందే తెలిసి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మంగళగిరి నేతలతో వెంటనే వైసీపీ హైకమాండ్ సమావేశం అయింది. గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతను అప్పగించింది. మంగళగిరిలో పార్టీ పరిస్థితిపై సమీక్షించి ఇన్ చార్జ్ ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆర్కే కాకుండా బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలోకి దించే అవకాశం ఉంది. అందుకే ఆర్కే కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే.. 11 నియోజకవర్గాల్లో 5 ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలు ఉండగా.. కొందరు మంత్రులకు కూడా ఇన్ చార్జీల బాధ్యతలను అప్పగించింది వైసీపీ హైకమాండ్.

YS Jagan : విడదల రజిని గుంటూరు పశ్చిమ బాధ్యతలు

అయితే.. మంత్రి విడదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు నుంచి పశ్చిమ బాధ్యతలు అప్పగించారు. ఇలా పలువురు మంత్రులకు ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జి నియోజకవర్గాలను మార్చి వేరే నియోజకవర్గాలను అందించారు జగన్. అయితే.. ఈ 11 నియోజకవర్గాలకు బాధ్యతలను ఎన్నికలకు 4 నెలల ముందే మార్చడంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది