YSRCP : తెలంగాణలో ఎవరు పాలన చేస్తున్నారు అంటే టక్కున కుటుంబ పాలన అంటారు. దానికి కారణం.. ఒక్క కుటుంబంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీ, ఇతర పదవుల్లో ఉన్న నేతలు.. ఇలా కల్వకుంట్ల కుటుంబమే రాజ్యమేలుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కానీ.. ఏపీలో పరిస్థితులు అలా లేవు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో అంతగా కుటుంబ రాజకీయాలు అయితే లేవు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. తన కుటుంబం నుంచి ఎవ్వరికీ పదవులు ఇవ్వలేదు. కానీ.. తనకు తెలిసిన వారు, దగ్గరి వారికి మాత్రం పదవులు ఇచ్చారు. తన సన్నిహితులకు టికెట్లు కూడా ఇచ్చారు.
2019 ఎన్నికల్లో కేవలం తన వాళ్లు అనుకొని కొందరికి టికెట్లు ఇచ్చారు వైఎస్ జగన్. అటువంటి వాళ్లకు మళ్లీ టికెట్ ఇవ్వాలా.. వద్దా అనే మీమాంసలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. కొందరికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్లు గెలిచినా గెలవకపోయినా ఇవ్వాల్సిందే. అందరికి ఇవ్వకున్నా కూడా కొందరికైతే ఇవ్వాలి. వాళ్లు ఆయనకు సొంత వ్యక్తులు. సొంత కుటుంబానికే చెందిన వారు కావడంతో వాళ్లకు టికెట్లు కన్ఫమ్ అనే వాదన వినిపిస్తోంది.జగన్ కు సొంత వ్యక్తులు అంటే.. ఈ ఇద్దరు జగన్ కు చాలా దగ్గర. అందుకే వీళ్లకు మళ్లీ టికెట్లు ఇచ్చే విషయంపై జగన్ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి వీళ్లకు టికెట్స్ కన్ఫమ్ అయ్యాయా లేదా అని చర్చ చేయడమే వేస్ట్.

YSRCP : ఇంతకీ ఎవరా సొంత వ్యక్తులు?
వాళ్లు ఆయనకు దగ్గర కాబట్టి టికెట్స్ కన్ఫమ్ అని అనుకోవాల్సిందే. సీఎం జగన్ తో వాళ్లకు ఉన్న అనుబంధం అటువంటిది. స్నేహం కూడా అలాంటిదే. కానీ.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ పేరు రావడంతో కొంచెం ఆయన మీద నెగెటివిటీ ప్రచారం అయింది. మరోవైపు ఎమ్మెల్యే పై సొంత నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఆయనపై ఎదరు తిరుగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంటి అనేది అంతు చిక్కడం లేదు. చూద్దాం మరి.. తన సొంత వ్యక్తులకు సీఎం జగన్ టికెట్స్ ఇస్తారో లేదో?