YS Jagan : జగన్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే ప్రాతిపదిక ఇదే.. పెద్ద స్కెచ్ వేసుకుని కూర్చున్నాడుగా..!
YS Jagan : నాకు విజయం కావాలి. 175 సీట్లకు 175 సీట్లు రావాలి. ఏదో అధికారంలోకి వచ్చామా అన్నట్టు కాదు.. 175 సీట్లు రావాలి. అదే సీఎం జగన్.. వైసీపీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసేది. తాజాగా తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న సురక్ష కార్యక్రమాలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎం జగన్ స్పష్టంగా తన మనసులో మాటను చెప్పేశారు. టికెట్లు అందరూ కన్ఫమ్ చేసుకోవడం కాదు. గెలిచే వారికే టికెట్లు ఇస్తాం.. ఓడిపోయే వారి వల్ల పార్టీకే నష్టం అని చెప్పుకొచ్చారు.జమే కదా. పార్టీ గెలవడం ముఖ్యం. అందులోనూ పార్టీకి 175 సీట్లకు అన్ని సీట్లు రావడం అనేది ముఖ్యం. ఏదో గెలిచామా అన్నట్టుగా కాకుండా ప్రతిపక్ష పార్టీకి ఏమాత్రం సందు ఇవ్వకూడదు. అదే సీఎం జగన్ నైజం.
ని ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతే నేనేం చేయలేను. ఎమ్మెల్యేలు ఎప్పుడూ నియోజకవర్గంలో ఉండాలి.. ప్రజల్లోనే ఉండాలి అని చాలా సమయం ఇచ్చాం. కానీ.. పనితీరును మెరుగుపరుచుకోకపోతే నేనేం చేయలేను.. అంటూ ఎమ్మెల్యేలకు ఖరాఖండిగా చెప్పేశారు సీఎం జగన్.ఇలాంటి వ్యాఖ్యలు చెప్పాలంటే కాస్తో కూస్తో ధైర్యం ఉండాలి. మీ పనితీరును మెరుగుపరుచుకోకపోతే నేనేం చేయలేను అని జగన్ చెప్పడంలో కొత్తేమీ లేదు. ఎందుకంటే ఆయనకు గుండె ధైర్యం ఎక్కువ. ఆయనకు నిర్మోహమాటం కూడా ఎక్కువే. మొహమాటానికి పోతే రాజకీయాల్లో నడవదు. దాన్ని సీఎం జగన్ వంటపట్టించుకున్నారు. అన్ని సీట్లు గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల మనసును గెలవాలి. అందుకే.. ఎమ్మెల్యేలు ఏంటి అనేది పక్కన పెట్టి..
YS Jagan : జగన్ కు ఈ మాత్రం గుండె ధైర్యం ఉండాల్సిందే
సర్వే నివేదికల ఆధారంగానే టికెట్లు ఇస్తామంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పలు సంస్థలతో సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరు గురించి నివేదికలు తెప్పించుకుంటూనే ఉన్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను చాలా రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా కొందరు ఎమ్మెల్యేలలో మార్పు లేదు. అందుకే.. అలాంటి నాయకులకు మళ్లీ టికెట్ ఇస్తే 175 సీట్లు కాదు కదా.. గెలిచే అవకాశాలు ఉండవు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.