YS Jagan : మ‌ళ్లీ బెంగ‌ళూరుకు జ‌గ‌న్.. ఏం చేయ‌బోతున్నాడంటూ అంద‌రిలో టెన్ష‌న్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : మ‌ళ్లీ బెంగ‌ళూరుకు జ‌గ‌న్.. ఏం చేయ‌బోతున్నాడంటూ అంద‌రిలో టెన్ష‌న్..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : మ‌ళ్లీ బెంగ‌ళూరుకు జ‌గ‌న్.. ఏం చేయ‌బోతున్నాడంటూ అంద‌రిలో టెన్ష‌న్..!

YS Jagan : ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల ఎన్నిక‌లలో దారుణ‌మైన ఓట‌మి చెందారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక‌పోయారు. దీంతో ఇప్పుడు ఆయ‌న స‌రికొత్త ప్రణాళిక‌లు ర‌చిస్తూ బిజీబిజీగా ఉన్నారు.రెండు వారాల వ్యవధిలోనే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారు. జూన్ 24నే బెంగళూరు వెళ్ళిన ఆయన.. జులై 1వరకు అక్కడే ఉండి వచ్చారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరుకు వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఈ వరుస పర్యటనల మర్మం ఏంటనే చర్చ జరుగుతోంది.

YS Jagan వ‌రుస ట్రిప్‌ల వెన‌క మ‌ర్మం ?

గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువశాతం పులివెందుల, బెంగళూరులోనే ఉన్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరుకావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు. కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళుతున్నారనే ప్రచారంతో.. అసెంబ్లీకి వస్తారా?.. విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు. వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్భార్ ప్రారంభించాలని భావించారు. వైఎస్సార్‌సీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్‌ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.. కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా వేశారు.

YS Jagan మ‌ళ్లీ బెంగ‌ళూరుకు జ‌గ‌న్ ఏం చేయ‌బోతున్నాడంటూ అంద‌రిలో టెన్ష‌న్

YS Jagan : మ‌ళ్లీ బెంగ‌ళూరుకు జ‌గ‌న్.. ఏం చేయ‌బోతున్నాడంటూ అంద‌రిలో టెన్ష‌న్..!

శాసన సభ సమావేశాల వేళ జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. కాబట్టి ఆయన వారం రోజులకు తిరిగి వస్తారని, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్‌ను కలిసినట్లు ప్రచారం జరిగింది.. అలాగే పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్సార్‌‌సీపీ మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని కొందరు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది