Ys Jagan : వైఎస్‌ జ‌గ‌న్ మార్క్ వ్యూహం మాములుగా లేదు.. ప‌వ‌న్, బాల‌య్య‌,లోకేష్‌ల‌పై మాములు స్కెచ్ మాములుగా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : వైఎస్‌ జ‌గ‌న్ మార్క్ వ్యూహం మాములుగా లేదు.. ప‌వ‌న్, బాల‌య్య‌,లోకేష్‌ల‌పై మాములు స్కెచ్ మాములుగా లేదుగా..!

 Authored By tech | The Telugu News | Updated on :17 March 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : వైఎస్‌ జ‌గ‌న్ మార్క్ వ్యూహం మాములుగా లేదు.. ప‌వ‌న్, బాల‌య్య‌,లోకేష్‌ల‌పై మాములు స్కెచ్ మాములుగా లేదుగా..!

Ys Jagan : ఏపీలో ఎన్నికల పోరు పీక్స్‌కి చేరుకుంది. మరి కొద్దిరోజుల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండగా, ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది అని ప్ర‌తి ఒక్క‌రు చూస్తున్నారు. ఇటీవ‌ల అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే ముందు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్న జ‌గ‌న్.. మార్చి 18న ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను గతం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లను కేటాయించారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు కేటాయించారు.

అయితే ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. పిఠాపరంలో వంగా గీత బలమైన అభ్యర్థి మాత్రమే కాకుండా.. ఆమె కాపు వర్గానికి చెందిన‌ది కావడంతో జ‌గ‌న్ ఈ సారి ఆమెని పోటీకి దింపిన‌ట్టు తెలుస్తుంది. మ‌హిల‌కి కాపు ఓట్లు ఎక్కువ ప‌డే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి జ‌గ‌న్ ప‌క్కా ప్లాన్ వేసి ఈ సారి మిధున్ రెడ్డికి ఈ నియోజకవర్గ బాధ్యత అందించిన‌ట్టు స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే ఈ సారి హిందూపురంలో బాలయ్యకు పోటీగా తిప్పె గౌడ నారాయణ దీపిక అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారు. టీడీపీ కంచుకోట‌కి బీట‌లు కొట్టే విధంగా జ‌గ‌న్ ఈ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

మంగళగిరి మీద కూడా జ‌గ‌న్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్తున్నారు. ఈసారి కూడా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య అభ్యర్థిత్వాన్ని అధినేత జగన్ ఖరారు చేసిన‌ట్టు తెలుస్తుంది. జ‌గ‌న్ వేసిన స్కెచ్‌కి లోకేష్ ఓట‌మి ఖాయ‌మ‌ని అంటున్నారు. ముప్పేట వ్యూహంతో నారా లోకేష్ ఓటమికి వైఎస్ జగన్ వ్యూహాన్ని రచించిన‌ట్టు తెల‌స్తుండ‌గా, ఏ క్ర‌మంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయా అని ప్ర‌తి ఒక్క‌రు ఎదురు చూస్తున్నారు. వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వకర్తలను ప్రకటించి ఈ సారి కూడా మంచి పోటీ ఇచ్చే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Tags :

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది