Raja Reddys Engagement : మేనల్లుడు నిశ్చితార్థ వేడుకలలో మెరిసిన జగన్... విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని...!
Raja Reddys Engagement : ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితర క్యాబినెట్ మంత్రులు కూడా ఈ వేడుకలకు తరలివచ్చారు. దీంతో గండికోట లోని గోల్కొండ రిసార్ట్ వేడుకలతో కలకల్లాడింది. అయితే అందరికంటే ప్రధానంగా జగన్ పై అందరి ఫోకస్ నిలిచిందని చెప్పాలి. అటు సోషల్ మీడియాలో కూడా జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాక జగన్ తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Raja Reddys Engagement : మేనల్లుడు నిశ్చితార్థ వేడుకలలో మెరిసిన జగన్… విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని…!
అయితే షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియ అనే అమ్మాయితో నిశ్చయమైన సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా నిశ్చితార్థ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలకు షర్మిల రాజకీయ ప్రముఖులను సినీ ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. దీనిలో భాగంగానే తన సోదరుడు జగన్ కు సైతం షర్మిల ఆహ్వాన పత్రిక అందించారు.
అయితే గత కొంతకాలంగా షర్మిలకు సోదరుడు జగన్ కు మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరో రెండు రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టనున్న షర్మిల ఇంట్లో ఫంక్షన్ కి జగన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Raja Reddys Engagement : మేనల్లుడు నిశ్చితార్థ వేడుకలలో మెరిసిన జగన్… విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని…!
ఇక ఈ నిశ్చితార్థ వేడుకలకు జగన్ తన సతీమణి భారతి రెడ్డితో కలిసి వచ్చారు. జగన్ వెంట వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడం జరిగింది. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలలో జగన్ కుటుంబ సభ్యులతో పాటు దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక ఈ సంబరాలలో జగన్ అంత సంతృప్తిగా కనిపించడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఆయన భార్య భారతి మాత్రం చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Raja Reddys Engagement : మేనల్లుడు నిశ్చితార్థ వేడుకలలో మెరిసిన జగన్… విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని…!
అయితే జగన్ మేనల్లుడు వివాహ నిశ్చితార్థ వేడుకలకు జగన్ హాజరు కావడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడనీ విషయం అని చెప్పాలి. ఇక ఈ వేడుకలలో జగన్ సోదరి షర్మిల తో పెద్దగా దగ్గరగా కూడా కనిపించలేదు. కానీ జగన్ తల్లి విజయమ్మ మరియు షర్మిల తో ఆప్యాయ ఆలింగనాలు చేసిన ఫోటోలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
This website uses cookies.