YS Jagan : ఈ సారి ఎన్నికలలో దారుణమైన ఓటమి చవి చూసిన జగన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికలలో ఘోర ఓటమిపాలై 11సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్ళారు అన్నది ఏపీలో చర్చిస్తున్నారు. అయితే ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను తొలగిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయం గురించి మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లారని అంటున్నారు. బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే డీకే శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే.. తన పార్టీని విలీనం చేస్తాననే నిస్సహాయత స్థితికి వెళ్లిపోయారు. 11 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారో తెలియని పరిస్థితి. నలుగురు ఎంపీలలో ఎంత మంది తనతో ప్రయాణిస్తారో తెలియని పరిస్థితి. రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ ఉన్నారు” అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
అయితే వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. మరోవైపు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే.. ఆయన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీ తరుఫున అభ్యర్థిని సైతం ప్రకటించారు. అయితే తొలుత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించి.. ఆ తర్వాత బీజేపీకి ఇవ్వటంతో తెలుగుతమ్ముళ్లు భగ్గుమన్నారు. దీంతో చంద్రబాబు.. వ్యూహాత్మకంగా నల్లమిల్లిని బీజేపీలోకి పంపించారు. ఆ పార్టీ తరుఫున పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.