YS Jagan Mohan Reddy : పొత్తు వలన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మూడు లాభాలు ..? అవేంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Mohan Reddy : పొత్తు వలన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మూడు లాభాలు ..? అవేంటంటే..!

 Authored By tech | The Telugu News | Updated on :11 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan Mohan Reddy : పొత్తు వలన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మూడు లాభాలు ..? అవేంటంటే..!

YS Jagan Mohan Reddy : రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వలన వైయస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మూడు లాభాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ తో జనసేన, టీడీపీ కలవడం వలన ప్రతి పార్టీకి ఉండే మైనారిటీ వర్గం అంతా జగన్ వైపు వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా. పొత్తు వలన ఆ పార్టీ మైనారిటీ వర్గంలో ఎంతోకొంత మొత్తంలో వైఎస్ జగన్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ నరేంద్ర మోడీ సపోర్ట్ కోసం వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో ఎగబడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం లో కొన్ని పనులు జరగడానికి కేంద్రం సపోర్టు ఉండాలి. అందుకే ఏ పార్టీ అయినా బీజేపీతో సత్సంబంధం కోసం ఎగబడుతుంది. అయితే ఈసారి బీజేపీ టీడీపీ కి సపోర్టుగా నిలిచింది..ఇక ఇప్పుడు కూటమిలో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు ప్రకటించారు. ఇక బీజేపీకి ఆరు నుంచి ఏడు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో జనసైనికుల నుంచి వ్యతిరేకత ఉంటుంది.

ఏడు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేనకు రెండు సీట్లు ఇవ్వడం ఏంటని, ఒక్క శాతం ఓటు బ్యాంకింగ్ లేని బీజేపీకి ఆరు లేదా ఏడు సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్న వస్తుంది. ఇప్పటికే జనసేన కు 24 ఎమ్మెల్యే సీట్లను ప్రకటించగా దానిపై జనసైనికులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు ఎంపీ స్థానాలు బిజెపికి ఎక్కువ ఇవ్వడం జనసైనికులకు నచ్చే అవకాశం ఉండదు. అలాగే ముద్రగడ పద్మనాభం, చేగొండ రామ జోగయ్య లాంటివారు వైసీపీలోకి వెళ్లడం వలన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ ఓట్లన్నీ వారికి వెళ్లే అవకాశం ఉంది. సీట్ల విషయంలో కూడా అసంతృప్తి ఉంది. బీజేపీ రాకముందు సీట్లు తక్కువ ఇచ్చి బీజేపీకి ఎక్కువ ఇవ్వడం జన సైనికులు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు వైసీపీ పార్టీలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక వైయస్ షర్మిల వామపక్షాలు అడుగులు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి లాభంగా మారనున్నాయి.

బీజేపీ కలిసి రాకపోతే వామపక్షాలతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు చూశారు. కానీ బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి, జనసేన, బీజేపీ పొత్తుకి దెబ్బ పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ మూడు కారణాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరనుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ వైఎస్ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తన ప్రచారాలతో వైయస్ షర్మిల మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కచ్చితంగా ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంటుంది అది కచ్చితంగా టీడీపీకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుతుందని అంటున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది